కరోనా గత వేరియంట్లతో ఊపిరి ఆడకపోయేది.. ఒమిక్రాన్‌లో ఈ లక్షణం ఎందుకు లేదు?

Omicron variant symptoms | రెండేండ్ల క్రితం కరోనావైరస్ బయటపడినప్పుడు అందరిలోనూ ఒక్కటే వణుకు. ఆ భయానికి తగ్గట్టే తీవ్రత కూడా అలాగే ఉండేది. ఒక్కసారి వైరస్ సోకిందా ఊపిరి ఆడేది కాదూ ! చాలామంది శ్వాస సమస్యలతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పుడు కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తే కానీ కోలుకునేవారు కాదు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లో దాదాపు ఇదే పరిస్థితి. కానీ తాజాగా బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్లో మాత్రం ఇంతటి దారుణ పరిస్థితి లేదు. కేవలం జలుబు, దగ్గు, గొంతు సమస్యలే కనిపిస్తున్నాయి. కానీ శ్వాసకు సంబంధించిన లక్షణాలు మాత్రం కనిపించడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై ఎయిమ్స్ వైద్యులు వివరణ ఇచ్చారు.

ఇప్పటివరకు మనం చూసిన కరోనా వైరస్ ప్రధానంగా శ్వాస వ్యవస్థపై దాడి చేసేది.. ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తుల్లోకి చేరేది. అక్కడే ఎగువ భాగంలో తిష్ట వేసి కోట్లాది కణాలుగా ఏర్పడేది. అనంతరం వాయు కుహారాలను, కండరాలపై దాడి చేసేది. దీనివల్ల గోడల భాగం గట్టిపడి.. ఊపిరితిత్తులకు వచ్చే రక్తానికి సరిపడా ఆక్సిజన్ అందేది కాదు. దీనివల్ల ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది. దీంతో దగ్గు, దమ్ము, శ్వాస సమస్యలు ఏర్పడేవి. ఇదే న్యుమోనియాకు దారి తీసేది. కానీ ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం ఊపిరితిత్తులకు చేరకుండా గొంతులోనే ఆగిపోతుందని ఎయిమ్స్ ఎయిమ్స్ వైద్యుడు, కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ పునీత్ మిశ్రా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బయటపడిన ఒమిక్రాన్ కేసులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. ఈ వేరియంట్లో వైరస్ గొంతులోనే ఉండిపోతుంది కాబట్టి ఊపిరితిత్తులకు ఎలాంటి హాని కలగడం లేదని డాక్టర్ పునీత్ మిశ్రా తెలిపారు. అందుకే శ్వాస సమస్యలు రావట్లేదని పేర్కొన్నారు.
నిజానికి డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ 7 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యనిపుణులు ముందుగానే చెప్పారు. ఇది వాస్తవమే అయినప్పటికీ.. ఈ వేరియంట్ వాటంత ప్రభావం చూపించడం లేదు. వైరస్ గొంతులోనే ఆగిపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తట్లేదు. అందుకే ఆక్సిజన్ అందించాల్సిన అవసరం గానీ.. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం గానీ రావట్లేదు. మరణాల రేటు కూడా తక్కువగా ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Omicron variant symptoms | గొంతులోనే వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే..
ఒమిక్రాన్‌తో కరోనా వైరస్ అంతం కాబోతుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Omicron | దేశంలో ఒమిక్రాన్ విజృంభణ.. 200కు పెరిగిన కేసులు
Omicron | బూస్టర్ డోస్ తీసుకున్న ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్
Omicron | అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు
Omicron | రాజన్న సిరిసిల్లలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

