Omicron variant symptoms | గొంతులోనే వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే..

Omicron variant symptoms | కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ వేరియంట్‌గా రూపాంతరం చెంది మరోసారి ప్రపంచదేశాలను వణికిస్తున్నది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో భయపడిపోతున్నారు. అయితే డెల్టా వేరియంట్ కంటే తొందరగా వ్యాప్తి చెందే శక్తి ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. కానీ మరి దానికంటే ప్రమాదరకమైనదా? కాదా అన్న విషయం మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ వేరియంట్ తీవ్రతతో పాటు ఇది సోకితే వచ్చే లక్షణాలపై అధ్యయనం చేశారు. ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణులు అక్కడి బాధితుల్లో కామన్‌గా కనిపించిన లక్షణాలను బయటపెట్టారు.
కరోనా వైరస్ సోకితే కనిపించే సాధారణ లక్షణాలతో పాటు మరికొన్ని విభిన్న లక్షణాలు కనిపించాయని దక్షిణాఫ్రికాకు చెందిన డిస్కవరీ హెల్త్ సీఈవో రేయాన్ నోచ్ వెల్లడించారు. వైరస్ సోకిన వారిలో ముఖ్యంగా గొంతు నొప్పి, ముక్కు దిబ్బెడ ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా విజృంభిస్తున్న యూకేలోనే ఇంచుమించుగా ఇవే లక్షణాలు ఉన్నాయి. వీటితోపాటు తలనొప్పి, అలసట వంటి అదనపు లక్షణాలు కూడా కనిపించాయని పేర్కొన్నారు. డిసెంబర్ 3 నుంచి 10 వరకు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలను గుర్తించారు. అయితే, ఇతర కరోనా వేరియంట్ల మాదిరిగా ఈ వేరియంట్ సోకిన వారిలో ఎడతెగని దగ్గు, తీవ్ర జ్వరం, వాసన కోల్పోవడం, రుచిని కోల్పోవడం లాంటి లక్షణాలేవి కనిపించలేదని పేర్కొన్నారు.
డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ చురుగ్గా వ్యాపిస్తుంది. కానీ ఇంతకుముందు ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఇది ప్రమాదకరమైనదా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ లక్షణాల్లో మాత్రం చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కరోనా సోకితే తీవ్రమైన జ్వరం, పొడిదగ్గు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఉండేవి. వీటితో పాటు ప్రధానంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండేది. మొదటి, సెకండ్ వేవ్ సమయంలో ఊపిరాడక.. ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితులు ఉన్న కేసులే ఎక్కువగా కనిపించాయి. కానీ ఒమిక్రాన్ వేరియంట్లో మాత్రం ఈ లక్షణం కనిపించడం లేదు. ఈ వైరస్ కేవలం గొంతు భాగంలోనే ఉంటుందని ఎయిమ్స్ డాక్టర్ పునీత్ ముస్రా తెలిపారు. గొంతు భాగంలోనే ఈ వైరస్ పునరుత్పత్తి చేసుకోవడం వల్ల గొంతు సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒమిక్రాన్‌తో కరోనా వైరస్ అంతం కాబోతుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Omicron | దేశంలో ఒమిక్రాన్ విజృంభణ.. 200కు పెరిగిన కేసులు
Omicron | బూస్టర్ డోస్ తీసుకున్న ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్
Omicron | అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు
Omicron | రాజన్న సిరిసిల్లలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదు
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- corona
- corona virus
- Health
- omicron
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

