ఒమిక్రాన్ వచ్చింది మన మంచికేనా?.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

Omicron variant | మొన్నటిదాకా డెల్టా అంటూ భయపెట్టించిన కరోనా వైరస్.. ఇప్పుడు ఒమిక్రాన్‌గా మారి చూస్తుండగానే ప్రపంచమంతటా విస్తరించింది. మునపటి వేరియంట్ల కంటే వేగంగా విజృంభిస్తోంది. అయితే ఇదంతా మన మంచికేనా? కరోనా అంతానికి ఇది సంకేతమా? అంటే తాజా అధ్యయనాలు అవుననే చెబుతున్నాయి. SARS cov2 కి చెందిన ఒమిక్రాన్ వేరియంట్ ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా.. ప్రజల ప్రాణాలకు హానికలిగించే డెల్టా వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తున్నదని దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
అధ్యయనం ఏం చెబుతోంది?
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ పెరగడం ఒక రకంగా మంచిదేనని ఆఫ్రికా హెల్త్ ఇన్స్టిట్యూట్ ఇన్ సౌతాఫ్రికా నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది. ఎందుకంటే ఒమిక్రాన్ కేసులు పెరగడం వల్ల ప్రజల ప్రాణాలకు హానికలిగించే డెల్టా వేరియంట్ కేసులు తగ్గిపోతున్నట్లు వెల్లడైంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన 33 మందిపై ఈ అధ్యయనం చేశారు. ఇందులో వ్యాక్సిన్ తీసుకున్న.. వ్యాక్సిన్ తీసుకుని వారు ఉన్నారు. అలాగే ఈ అధ్యయనం ప్రకారం.. ఒమిక్రాన్ వేరియంట్ బయటపడినప్పటి నుంచి 14 రోజుల్లో 14 రెట్లు కేసులు పెరిగాయి. అదే సమయంలో డెల్టా వేరియంట్ తటస్థీకరణ చెందడం 4.4 రెట్లు పెరిగింది. అంటే డెల్టా వేరియంట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి.. వైరస్ ప్రభావాన్ని ఈ ఒమిక్రాన్ వేరియంట్ తగ్గిస్తుందని ఆఫ్రికా హెల్త్ ఇన్స్టిట్యూట్ ఇన్ సౌతాఫ్రికా ప్రొఫెసర్ అలెక్స్ సెగల్ పేర్కొన్నారు.
ఒమిక్రాన్‌తో ముప్పు తక్కువే
డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ బారినపడిన వారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని ఇంతకుమందు నిర్వహించిన అధ్యయనాల్లో బయటపడింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ బాధితులు ఆస్పత్రిలో చేరాల్సిన రిస్క్ 50 నుంచి 70 శాతం తగ్గిందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. అదే దక్షిణాఫ్రికాలో నిర్వహించిన అధ్యయనంలో ఈ ముప్పు 70 శాతం వరకు తగ్గినట్టు తెలిసింది. ఇక మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ 70 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని.. కానీ ఊపిరితిత్తులపై దీని ప్రభావం మాత్రం చాలా తక్కువగా ఉందని హాంకాంగ్‌లో నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కరోనా గత వేరియంట్లతో ఊపిరి ఆడకపోయేది.. ఒమిక్రాన్‌లో ఈ లక్షణం ఎందుకు లేదు?
ఒమిక్రాన్‌తో కరోనా వైరస్ అంతం కాబోతుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Omicron variant symptoms | గొంతులోనే వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే..
Delmicron | డెల్మిక్రాన్.. డెల్టా, ఒమిక్రాన్ కంటే ఇది ప్రమాదకరమా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

