Delmicron | డెల్మిక్రాన్.. డెల్టా, ఒమిక్రాన్ కంటే ఇది ప్రమాదకరమా?

Delmicron | ఒమిక్రాన్ భయాలు ఒకవైపు కొనసాగుతుండగానే.. ‘డెల్మిక్రాన్’ పేరిట మరో కొత్త రూపాంతరం చాప కింద నీరులా విస్తరిస్తున్నది. అమెరికా, బ్రిటన్‌లో రోజుకు సగటున లక్షకు పైగా కేసులు నమోదవ్వడానికి ఈ కొత్త వేరియంట్ కూడా కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏమిటీ డెల్మిక్రాన్?
కరోనా వేరియంట్లు డెల్టా, ఒమిక్రాన్ కలయికతో ఏర్పడినదే ‘డెల్మిక్రాన్’. డెల్టా, ఒమిక్రాన్‌తో పోలిస్తే, ఇది మరింత వేగంగా వ్యాపిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ‘డెల్మిక్రాన్లో రెండు స్పైక్ ప్రొటీన్లు ఉన్నాయి. ఒకటి డెల్టాది కాగా, మరొకటి ఒమిక్రాన్ది’ అని కొవిడ్-19 కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి తెలిపారు. డెల్టా, ఒమిక్రాన్‌తో పోలిస్తే.. డెల్మిక్రాన్ మరింత వేగంగా వ్యాపిస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా, ఐరోపాలో కేసుల పెరుగుదలకు కొత్త వేరియంటే కారణమని అంచనా వేశారు.
ప్రభావం ఎలా ఉండనున్నది?
దేశంలో బీభత్సం సృష్టించిన కరోనా సెకండ్ వేవ్‌కు ముఖ్య కారణం డెల్టా వేరియంట్. అయితే, డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా, వేగంగా ఉన్నప్పటికీ ప్రభావం మాత్రం అంతగా లేదు. అయితే, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల స్పైక్ ప్రొటీన్లతో ఏర్పడిన ‘డెల్మిక్రాన్’ ప్రభావం ఎలా ఉండబోతున్నదన్న విషయం ఇప్పుడే చెప్పలేమని నిపుణులు తెలిపారు.
దేశంలో డెల్మిక్రాన్ వ్యాపించిందా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 300 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు రోజువారీ సగటు కరోనా కేసులు 7 వేలుగా రికార్డవుతున్నాయి. ఇందులో డెల్టా కేసులు కూడా ఉన్నాయి. అంటే దేశంలో రెండు వేరియంట్ల ప్రభావం ఏకకాలంలో ఉన్నదని, ఈ లెక్కన ‘డెల్మిక్రాన్’ కేసులు రికార్డు అయ్యే అవకాశం లేకపోలేదని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
డెల్మిక్రాన్ లక్షణాలు ఏమిటి?
తీవ్ర జ్వరం, నిరంతర దగ్గు, రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, గొంతు మంట, ముక్కు కారడం
నివారణ మార్గం?
వ్యాక్సిన్ వేసుకోవడం, ముఖానికి మాస్కు ధారణ, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదూరం నియమాలను పాటించడం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Omicron cases | ఢిల్లీలో రెండు డోసులు తీసుకున్న 33 మందికి ఒమిక్రాన్
కరోనా గత వేరియంట్లతో ఊపిరి ఆడకపోయేది.. ఒమిక్రాన్‌లో ఈ లక్షణం ఎందుకు లేదు?
Omicron variant symptoms | గొంతులోనే వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే..
ఒమిక్రాన్‌తో కరోనా వైరస్ అంతం కాబోతుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

