Omicron cases | ఢిల్లీలో రెండు డోసులు తీసుకున్న 33 మందికి ఒమిక్రాన్
Omicron cases | భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా కొత్త రూపమైన ఒమిక్రాన్ వేరియంట్ బాధితులలో వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకున్నవారే ఎక్కవగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం

భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ బాధితులలో వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకున్నవారే ఎక్కవగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. దేశ రాజధాని ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో 34 మంది ఒమిక్రాన్ చికిత్స కోసం చేరగా.. వీరిలో 33 మంది పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నవారు ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఈ 34 మందిలో 18 మంది పూర్తిగా కోలుకున్నారని లోక్ నాయక్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. బాధితులలో ఇద్దరు విదేశీ ప్రయాణికులు బూస్టర్ డోసు(మూడవ డోసు) కూడా తీసుకున్నారని ఆయన అన్నారు.
“ఒమిక్రాన్ సోకిన వారిలో ఊపిరి సమస్యలు తక్కువగా ఉండడం ఊరట కలిగిస్తున్న విషయం. ఇది వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే అయిఉంటుంది.. అందువల్ల వ్యాక్సిన్ తీసుకోని వారికి ఒమిక్రాన్ సోకితే వారిలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉండే అవకాశముంది” అని డాక్టర్ సురేష్ అభిప్రాయపడ్డారు.
లోక్ నాయక్ ఆస్పత్రిలో చేరిన 34 ఒమిక్రాన్ బాధితుల్లో అయిదుగురు యూరప్, ఆఫ్రికా దేశస్తులు ఉండడం గమనార్హం. ఢిల్లీలో ఇప్పటివరకు 57 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాలతో పోలీస్తే ఒమిక్రాన్ కేసులు ఢిల్లీలోనే అధికం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

