Vijay Rupani : అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) లో మరణించిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు కేవలం 31 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించారు. గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి (Former CM) విజయ్ రూపానీ (Vijay Rupani) మృతదేహాన్ని కూడా ఇంకా గుర్తించలేకపోయారు.
ఇప్పటికే ఆయన రక్తసంబంధీకుల డీఎన్ఏను సేకరించిన అధికారులు ఆ డీఎన్ఏతో సరిపోలే శరీర భాగాల కోసం వెతుకుతున్నారు. అదేవిధంగా మిగతావారి మృతదేహాలను కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. గత గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన తర్వాత కొన్ని సెకన్లలోనే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందికిగాను 241 మంది ప్రాణాలు కోల్పోయారు. రమేష్ విశ్వాస్ అనే ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అదేవిధంగా హాస్టల్ భవనంలో ఉన్న వైద్యులు, సిబ్బంది కూడా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా మరో 14 మంది మరణించారు. దాంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 279కి చేరింది.