Kamal Haasan : తాను రెండు దశాబ్దాలు ముందుగానే రాజకీయ ప్రవేశం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Haasan) అన్నారు. రాజకీయంగా తానెంతో ఉన్నత స్థితిలో ఉండేవాడినని చెప్పారు. అప్పట్లో రాజకీయాల్లోకి రాకుండా వెనుకంజ వేయటమే తన మొదటి ఓటమి అని ఆయన తెలిపారు. తన పార్టీ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఆళ్వార్‌పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ పయనంలో అభిమానులు వేరు, ఓటర్లు వేరు అనే విషయాన్ని గ్రహించగలిగానని కమల్‌హాసన్ చెప్పారు. పార్టీకి చివరి ఓటరు ఉన్నంత వరకు తమ పార్టీ సేవలు కొనసాగిస్తామని అన్నారు. ఇరవై ఏళ్ల క్రితం తాను రాజకీయ ప్రవేశం చేసి ఉండాలని, అప్పట్లో తగు నిర్ణయం తీసుకుని ఉంటే తాను రాజకీయాల్లో ఉన్నతస్థితిలో ఉండేవాడిని అభిప్రాయపడ్డారు.
ఇక తమిళ భాష గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరినీ సమైక్యపరిచేది తమిళ భాషేనని, తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుపోతుండటానికి కారణం తమిళ ప్రజలేనని కమల్ చెప్పారు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన తమిళభాషను ఎవరూ కిందకు దించలేరని అన్నారు. అదేవిధంగా ఈ ఏడాది పార్లమెంటులో తొలిసారి పార్టీ వాణి వినిపించనుందని అన్నారు.
ఎందుకంటే ఈ ఏడాది జూలైలో తమిళనాడులోని కొన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దాంతో ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అధికార డీఎంకే కమల్ పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించనుంది. కమల్ హాసన్‌తోపాటు ఆయన పార్టీకి చెందిన మరో వ్యక్తి రాజ్యసభకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. అంతేగాక వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీలో కూడా పార్టీ సభ్యులుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు.
పార్టీ శ్రేణులంతా తోచినంతలో ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని, అప్పుడే పార్టీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని కమల్ హాసన్ అన్నారు.
Gun Shot | పెళ్లి వేడుకలో గాల్లోకి కాల్పులు.. బుల్లెట్ తగిలి సర్పంచ్ భర్త మృతి.. Video
Deaths | ఉన్నతాధికారి కుటుంబం అనుమానాస్పద మృతి.. ఆత్మహత్యలేనా..?
Bhutan PM | ఆయనలో నా అన్నను చూసుకుంటున్నా.. మోదీ నాయకత్వంపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
PM Modi | దేశంలో ‘ఛావా’ హవా నడుస్తోంది.. విక్కీ కౌశల్ సినిమాపై ప్రధాని ప్రశంసలు
Alia Bhatt | చాలా బాగున్నావు.. ముఖ్యంగా నీ కళ్లు.. ఆ హీరోయిన్ని పొగడ్తలతో ముంచెత్తిన అలియా భట్
Brazil Nuts | థైరాయిడ్ ఉన్నవారికి వరం.. ఈ నట్స్.. ఇంకా ఎన్నో లాభాలు..!
Kamal Haasan | భాషతో ఆటలొద్దు.. హిందీ వివాదంపై కమల్ హాసన్ హెచ్చరిక