Bhutan PM : భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పై భూటాన్ ప్రధాని (Bhutan PM) షెరింగ్ టోబ్గే (Tshering Tobgay) ప్రశంసలు కురిపించారు. భారత ప్రధాని మోదీ తనకు అన్నయ్య, గురువు లాంటి వారని అన్నారు. న్యూఢిల్లీ (New Delhi) లో జరిగిన స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ కాంక్లేవ్ (School of Ultimate Leadership (SOUL) conclave) లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా, భూటాన్ దేశాల మధ్య బలమైన ఆధ్యాత్మిక బంధం ఉన్నదని చెప్పారు. ప్రధాని మోదీ తనకు పెద్దన్న లాంటి వారని, ఆయన తన తెలివితేటలు, ధైర్యసాహసాలు, కరుణతో కేవలం పదేళ్లలోనే భారత్‌ను ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు.
‘ఎలాంటి సందేహం లేకుండా నేను ఆయనలో ఒక అన్నను చూసుకుంటున్నా. ఆయన ఎల్లప్పుడూ నా వెన్నంటి ఉంటూ నన్ను నడిపిస్తుంటారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. అలాగే భారత ఆర్థికవ్యవస్థ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంది. మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్‌గా మారుతోంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటివి ఇండియాకు మోదీ ఇచ్చిన బహుమతులు. నాయకత్వం అంటే బిరుదులు, పదవులు కాదు. దార్శనికత, ధైర్యం, మార్పును ప్రేరేపించే సామర్థ్యం’ అని షిరింగ్ టోబ్గే వ్యాఖ్యానించారు.
నాయకత్వం అంటే పరివర్తన అని, సమాజాన్ని సంతోషకరమైన, సంపన్నమైన, శాంతియుతమైన భవిష్యత్తువైపు నడిపించడమని టోబ్గే చెప్పారు. భూటాన్ దేశానికి భారతీయుల నుంచి బలమైన మద్దతు, దాతృత్వం లభించిందని అన్నారు. భూటాన్‌లోని గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ ప్రాజెక్టును భారతీయులు సందర్శించాలని ఆయన కోరారు. భూటాన్‌లో ప్రజాసేవ పరివర్తనలో తనకు ప్రధాని మోదీ వ్యక్తిగత మార్గదర్శకత్వం కావాలన్నారు. చివరగా ఆయన తన ప్రసంగాన్ని జైహింద్ అంటూ ముగించారు. టోబ్గే ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ.. టోబ్గేను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా టోబ్గే తన సోదరుడని అన్నారు.
PM Modi | దేశంలో ‘ఛావా’ హవా నడుస్తోంది.. విక్కీ కౌశల్ సినిమాపై ప్రధాని ప్రశంసలు
Alia Bhatt | చాలా బాగున్నావు.. ముఖ్యంగా నీ కళ్లు.. ఆ హీరోయిన్ని పొగడ్తలతో ముంచెత్తిన అలియా భట్
Brazil Nuts | థైరాయిడ్ ఉన్నవారికి వరం.. ఈ నట్స్.. ఇంకా ఎన్నో లాభాలు..!
Kamal Haasan | భాషతో ఆటలొద్దు.. హిందీ వివాదంపై కమల్ హాసన్ హెచ్చరిక