PM Modi : బాలీవుడ్ నటుడు (Bollywood Actor) విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఛావా (Chhava). మరాఠా మహారాజు (Marati Maharaj) ఛత్రపతి శివాజీ (Chatrapati Shivaji) కుమారుడైన శంభాజీ మహారాజ్ (Shambaji Maharaj) జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో నటుడు విక్కీ కౌశల్, శంభాజీ మహారాజ్ సతీమణి పాత్రలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) అద్భుతంగా నటించి మెప్పించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే బ్లాక్ బస్టర్ (Black buster) టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో చరిత్రలో చాలా మందికి తెలియని ఓ గొప్ప మహారాజు శంభాజీ గురించి చూపించారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్‌తో పాటు రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఛావా చిత్రానికి లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్‌కు చెందిన దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని శివాజీ సావంత్ మరాఠీ నవల ఛావా ఆధారంగా రూపొందించారు. 2025 లో రూ. 200 కోట్ల మార్కును దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఛావా సినిమా రికార్డు సృష్టించింది.
ఛావా చిత్రం ప్రస్తుతం 2025 లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. విక్కీ నటనతో మరోసారి దేశ ప్రజలు ఛత్రపతి శివాజీని, ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్‌ను గుర్తుచేసుకున్నారు. సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు అందరూ ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఛావాపై ప్రశంసలు కురిపించారు. 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఛావా సినిమాను ప్రశంసించారు.
‘ఛావా సినిమా గురించే ప్రస్తుతం దేశం అంతటా టాక్ వినిపిస్తోంది. దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించింది. మహారాష్ట్ర ప్రజలు గతంలో సైన్స్, ఆయుర్వేదం, లాజికల్, రీజనింగ్ వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారు. మహారాష్ట్ర, ముంబై నగరం కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలోనూ కీలకపాత్ర పోషించాయి.’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Alia Bhatt | చాలా బాగున్నావు.. ముఖ్యంగా నీ కళ్లు.. ఆ హీరోయిన్ని పొగడ్తలతో ముంచెత్తిన అలియా భట్
Brazil Nuts | థైరాయిడ్ ఉన్నవారికి వరం.. ఈ నట్స్.. ఇంకా ఎన్నో లాభాలు..!
Kamal Haasan | భాషతో ఆటలొద్దు.. హిందీ వివాదంపై కమల్ హాసన్ హెచ్చరిక