Alia Bhatt | చాలా బాగున్నావు.. ముఖ్యంగా నీ కళ్లు.. ఆ హీరోయిన్ని పొగడ్తలతో ముంచెత్తిన అలియా భట్
సాధారణంగా సినిమా పరిశ్రమలో ఒక హీరోయిన్ని మరో హీరోయిన్ పొగడటం అరుదు. కానీ అలియా భట్ మాత్రం ఇగో పక్కన పెట్టి, తన తోటి హీరోయిన్ రష్మిక మందన్నాను పొగడ్తలతో ముంచెత్తింది.
Alia Bhatt | సాధారణంగా సినిమా పరిశ్రమలో ఒక హీరోయిన్ని మరో హీరోయిన్ పొగడటం అరుదు. కానీ అలియా భట్ మాత్రం ఇగో పక్కన పెట్టి, తన తోటి హీరోయిన్ రష్మిక మందన్నాను పొగడ్తలతో ముంచెత్తింది. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ‘ఛావా’ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘ఛావా’ను రీసెంట్గా అలియాభట్ చూసింది. వెంటనే ఇన్‌స్టా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
‘ ‘ఛావా’ ఓ అద్భుతం. ముందుగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్‌కి అభినందనలు. చాలా గొప్పగా తీశారు. విక్కీకౌశల్ అద్భుతంగా నటించారు. నా అభిమాన నటుడు అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా మారిపోయారు. ఇక రష్మిక.. ‘చాలా అందంగా ఉన్నావు.. ముఖ్యంగా నీ కళ్లు..’ ’ అంటూ ప్రశంసలు గుప్పించింది అలియా భట్. అలియా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

