Gun Shot : దేశంలో తుపాకుల (Guns) వినియోగంపై ఎన్ని కఠిన నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కుతున్నారు. శుభకార్యాల్లో తాగి తందనాలు ఆడుతూ ఇష్టారీతిన తుపాకులతో ఆడుకుంటున్నారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ (Punjab) లో ఈ విపరీత పోకడ ఎక్కువగా ఉంది. తాజాగా పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లాలోని గొరయా గ్రామంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఓ పెళ్లి వేడుకలో కొంతమంది నృత్యాలు చేస్తుండగా ఓ వ్యక్తి తప్పతాగి గాల్లోకి కాల్పులు జరుపుతూ కనిపించాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త 45 ఏళ్ల పరమ్జీత్ సింగ్ తన ముందు నుంచి వెళ్తుండగా అతడి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దాంతో అతను కుప్పకూలి అరుస్తున్నా వినకుండా సదరు వ్యక్తి మరో రెండు రౌండ్లు గాల్లోకి కాల్చాడు. ఆ తర్వాత ఇతరులతో కలిసి మెల్లగా పైకి లేపాడు.
Firing .. A young man was shot dead in an air firing at a wedding ceremony in Jalandhar. According to information, the deceased is the husband of the current sarpanch of the village. The video of the incident is going viral on social media.
Although the wife of the deceased says… pic.twitter.com/hhn07ylkyK— Waahiid Ali Khan (@waahiidalikhan) February 22, 2025
తీవ్రంగా గాయపడిన పరమ్జీత్ను ఆస్పత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముందుగా పోలీసులు, మృతుడి భార్య పరమ్జీత్ గుండెపోటుతో మరణించాడని చెప్పారు. నిందితుడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ తర్వాత వీడియో వైరల్ కావడంతో అసలు విషయం బయటపడింది. దాంతో కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు నిందితుడు ఫైరింగ్ చేసిన తీరును చూస్తుంటే అది సెలెబ్రేటరీ ఫైరింగ్లా లేదు. అతడు ఉద్దేశపూర్వకంగానే పరమ్జీత్ను షూట్ చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ముందుగా గాల్లోకి తుపాకీ ఎక్కుపెట్టిన నిందితుడు పరమ్జీత్ తన సమీపానికిరాగానే అతడిని షూట్ చేశాడు. దాంతో పరమ్జీత్ కుప్పకూలి అరుస్తున్నా పట్టించుకోకుండా గాల్లోకి ఇంకో రౌండ్లు కాల్పులు జరిపాడు. నిందితుడి తీరు చూస్తుంటే సెలెబ్రేటరీ ఫైరింగ్ పేరుతో పరమ్జీత్ను హత్య చేసినట్లు కనిపిస్తోంది.
Deaths | ఉన్నతాధికారి కుటుంబం అనుమానాస్పద మృతి.. ఆత్మహత్యలేనా..?
Bhutan PM | ఆయనలో నా అన్నను చూసుకుంటున్నా.. మోదీ నాయకత్వంపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
PM Modi | దేశంలో ‘ఛావా’ హవా నడుస్తోంది.. విక్కీ కౌశల్ సినిమాపై ప్రధాని ప్రశంసలు
Alia Bhatt | చాలా బాగున్నావు.. ముఖ్యంగా నీ కళ్లు.. ఆ హీరోయిన్ని పొగడ్తలతో ముంచెత్తిన అలియా భట్
Brazil Nuts | థైరాయిడ్ ఉన్నవారికి వరం.. ఈ నట్స్.. ఇంకా ఎన్నో లాభాలు..!
Kamal Haasan | భాషతో ఆటలొద్దు.. హిందీ వివాదంపై కమల్ హాసన్ హెచ్చరిక