Deaths : సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ (Central Excise and GST) విభాగంలో అదనపు కమిషనర్ (Additional commissioner) గా బాధ్యతలు నిర్వహిస్తున్న మనీష్ (Manish) కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించింది. మనీష్ (Manish), ఆయన తల్లి శకుంతల (Shakuntala), సోదరి శాలిని (Shalini) కేరళలోని తమ నివాసంలో మృతిచెంది ఉన్నారు. మనీష్ కార్యాలయానికి చెందిన సిబ్బంది వారి ఇంటికి వెళ్లి చూడటంతో ఈ మరణాల విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌కు చెందిన మనీష్ కొచ్చిలో కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్నారు. ఎర్నాకుళం జిల్లాలోని కక్కనాడ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లో ఆయన తల్లి, సోదరితో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల నాలుగు రోజులు సెలవుపెట్టిన మనీష్.. సెలవులు పూర్తయినా తిరిగి విధులకు హాజరుకాలేదు. దాంతో ఆయన సహోద్యోగులు ఇంటికి వెళ్లారు. ఇంటి పరిసరాల్లోకి వెళ్లగానే తీవ్ర దుర్గంధం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా ముగ్గురూ మృతిచెంది ఉన్నారు.
మనీష్, శాలినిలు వేర్వేరు బెడ్రూమ్లలో ఉరికంబానికి వెళాడుతూ కనిపించగా.. వారి తల్లి శకుంతల మృతదేహంపై బెడ్‌పై పడి ఉంది. ఆమె మృతదేహాన్ని తెల్లని బట్టలో చుట్టి ఉంచారు. మృతదేహం పక్కన పువ్వులు పెట్టారు. దీన్ని బట్టి పిల్లలకంటే ముందు శకుంతల చనిపోయిందనే విషయం స్పష్టమవుతోంది. మరి ఆమెకు హత్యకు గురయ్యారా.. అనారోగ్యంతో చనిపోయారా అనేది అనుమానంగా ఉంది.
పోలీసులు మాత్రం ముగ్గురివి ఆత్మహత్యలేనని అనుమానిస్తున్నారు. తల్లి మరణించడంతో అది తట్టుకోలేక మనీష్, శాలిని ఇద్దరూ ఉరేసుకుని చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎవరైనా వారిని హత్య చేసి కూడా ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాళ్లు ఎప్పుడు చనిపోయారనేది పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
మనీష్ ఇంట్లోని ఓ గదిలో ఒక లేఖ లభ్యమైంది. తమ సోదరి ఒకరు విదేశాల్లో ఉంటారని, ఆమెకు తమ మరణాల గురించి సమాచారం ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో ఆమెకు సమాచారం ఇచ్చారు. ఆమె ఇండియాకు వచ్చిన తర్వాతనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే మనీష్ సోదరి శాలిని 2006లో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో తొలి ర్యాంకుతో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించింది.
అయితే ఆ తర్వాత ఆమె అర్హతలను మరో అభ్యర్థి సవాల్ చేసింది. దాంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఆమె న్యాయం కోసం పోరాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కూడా కేసు నిమిత్తం జార్ఖండ్‌కు వెళ్లడం కోసం మనీష్ విధులకు నాలుగు రోజులపాటు సెలవుపెట్టారు. నాలుగురోజులు పూర్తయినా ఆయన తిరిగి విధులకు వెళ్లకపోవడంతో సహోద్యోగులు ఇంటికి వెళ్లగా మరణాల విషయం బయటపడింది.
Bhutan PM | ఆయనలో నా అన్నను చూసుకుంటున్నా.. మోదీ నాయకత్వంపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
PM Modi | దేశంలో ‘ఛావా’ హవా నడుస్తోంది.. విక్కీ కౌశల్ సినిమాపై ప్రధాని ప్రశంసలు
Alia Bhatt | చాలా బాగున్నావు.. ముఖ్యంగా నీ కళ్లు.. ఆ హీరోయిన్ని పొగడ్తలతో ముంచెత్తిన అలియా భట్
Brazil Nuts | థైరాయిడ్ ఉన్నవారికి వరం.. ఈ నట్స్.. ఇంకా ఎన్నో లాభాలు..!
Kamal Haasan | భాషతో ఆటలొద్దు.. హిందీ వివాదంపై కమల్ హాసన్ హెచ్చరిక