చోక్సీ కిడ్నాప్‌పై దర్యాప్తు షురూ!
చోక్సీ కిడ్నాప్‌పై దర్యాప్తు షురూ! | పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ కిడ్నాపింగ్ వ్యవహారంపై అంటిగ్వా-బార్బుడా పోలీసులు దర్యాప్తు ....

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ కిడ్నాపింగ్ వ్యవహారంపై అంటిగ్వా-బార్బుడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనను కిడ్నాప్ చేసిన వ్యక్తుల పేర్లను అంటిగ్వా పోలీసులకు చోక్సీ చెప్పినట్లు తెలుస్తున్నది.
రూ.13,500 కోట్ల మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కి శఠగోపం పెట్టిన మెహుల్ చోక్సీ.. తర్వాత దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అంటిగ్వా నుంచి చట్ట విరుద్ధంగా ప్రవేశించినందుకు డొమినికాలో గత నెల 23వ తేదీన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, చోక్సీని కిడ్నాప్ చేసిన వ్యక్తుల పేర్లను ఆయన న్యాయవాదుల టీం పోలీసు కమిషనర్‌కు రాత పూర్వకంగా తెలిపిందని అంటిగ్వా ప్రధాని బ్రౌనే చెప్పారు. ఒకవేళ చోక్సీ ఆరోపణ నిజమైతే అది తీవ్రమైన అంశం అని చెప్పారు.
కానీ, స్థానిక మీడియాలో మాత్రం డొమినికా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశ విపక్ష నేతలతో కలిసి చోక్సీ న్యాయవాదులు కుట్ర పన్నారని తెలుస్తున్నది. అంటిగ్వా నుంచి చట్ట విరుద్ధంగా ప్రవేశించడంపై విచారించడానికి బదులు.. చోక్సీని కిడ్నాప్ చేశారన్న వాదననే న్యాయస్థానం విశ్వసించడం గమనార్హం.
తన అరెస్ట్‌పై చోక్సీ దాఖలు చేసిన హైబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన డొమినికా హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే, ఇరు పక్షాలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత హైకోర్టు జస్టిస్ బెర్నై స్టీఫెన్సన్ విచారణ తేదీని ఖరారు చేస్తారు.
డొమినికా హైకోర్టు తాజా నిర్ణయంతో తక్షణం భారత్‌కు అప్పగింత ప్రక్రియ నుంచి చోక్సీకి ఉపశమనం లభించింది. అంతే కాదు.. పీఎన్బీ స్కామ్‌లో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భారత్ అధికారులు తనను విచారించవచ్చునని న్యాయస్థానంలో సమర్పించిన అఫిడవిట్లో చోక్సీ పేర్కొన్నాడు.
తాను చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తినని మెహుల్ చోక్సీ పేర్కొన్నాడు. కేవలం వైద్య చికిత్స కోసమే భారత్‌ను వీడానని చెప్పుకొచ్చాడు. తనను పోలీస్ కస్టడీలో ఉంచితే, మధుమేహం, బ్లడ్ క్లాట్‌తోపాటు తీవ్రమైన హ్రుద్రోగ సమస్యలతో తన ఆరోగ్యం మరింత విషమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి:
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
సెంట్రల్ బ్యాంక్, ఐఓబీలో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహలు
అన్‌లాక్ షురూ : మెట్రో రైల్, మార్కెట్లు ఓపెన్
కొవిడ్ చికిత్స నుంచి ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్ ఔట్.. సీటీ స్కాన్లూ వద్దు!
దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు
కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్‌తోనే ఎక్కువ యాంటీబాడీలు!
మళ్లీ అమ్మాయి పుట్టిందని భార్యా పిల్లలను బావిలోకి తోసేసిన భర్త
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
అధిష్ఠానం కోరితే రాజీనామా చేస్తా
జూలై 1 నుంచి బ్యాడ్ బ్యాంక్ ప్రారంభం?! ఎందుకంటే?!
చోక్సీ అప్పగింత డౌటేనా? అసలేం జరిగింది?!
స్వల్పకాలం కార్ల ధరలు స్టేబుల్: ఫోక్స్ వ్యాగన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

