e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News ఢిల్లీలో రైతు పార్లమెంట్‌.. షరతులతో అనుమతి

ఢిల్లీలో రైతు పార్లమెంట్‌.. షరతులతో అనుమతి

ఢిల్లీలో రైతు పార్లమెంట్‌.. షరతులతో అనుమతి

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో ప్రదర్శన నిర్వహించుకునేందుకు రైతులకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతించింది. రైతులు ఈ నెల 22 నుంచి ఆగస్ట్‌ వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రైతుల నిరసన ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ముగించాల్సి ఉంటుంది. రైతులు చేసిన వినతి మేరకు ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. గత జనవరి 26 న ఢిల్లీలో రైతులు నిర్వహించిన ప్రదర్శన తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రైతులు ఢిల్లీ ప్రవేశానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో గత ఎనిమిది నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్నారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రైతు పార్లమెంట్‌ నిర్వహించాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ప్రతిరోజు 200 మందితో రైతు పార్లమెంట్‌ జరిపేందుకు అనుమతివ్వాలని ఢిల్లీ ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. రైతు సంఘాల వినతిపై షరతులతో కూడిన అనుమతిని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ఇచ్చింది. దాంతో

- Advertisement -

భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్‌ నేతృత్వంలో 200 మంది రైతులు ప్రత్యేక బస్సులో జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. పార్లమెంట్‌కు సమీపంలో ఉన్న జంతర్‌మంతర్‌ వద్ద రైతు పార్లమెంట్‌ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ పరిసరాలతోపాటు పార్లమెంట్‌ వద్ద గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. పార్లమెంటు వైపునకు ఎలాంటి కవాతు చేపట్టకుండా షరతులు విధించినప్పటికీ.. రైతులు జంతర్‌ మంతర్‌ దాటి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం

రహస్య చట్టంలో మార్పులకు బ్రిటన్‌ సన్నాహాలు

రాజ్‌కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?

ఇంట్లో ఫోన్‌ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఢిల్లీలో రైతు పార్లమెంట్‌.. షరతులతో అనుమతి
ఢిల్లీలో రైతు పార్లమెంట్‌.. షరతులతో అనుమతి
ఢిల్లీలో రైతు పార్లమెంట్‌.. షరతులతో అనుమతి

ట్రెండింగ్‌

Advertisement