Dhanush | తలవంచి ఎరగడే.. ధనుష్ స్వీయదర్శకత్వంలో నటిస్తున్న రాయన్ ప్రమోషన్స్ షురూ..
తమిళ అగ్రకథానాయకుడు ధనుష్ స్వీయదర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్'. ఇది ఆయన 50వ చిత్రం కావడం విశేషం. సందీప్‌కిషన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ఇండియా చిత్రం జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Dhanush | తమిళ అగ్రకథానాయకుడు ధనుష్ స్వీయదర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్’. ఇది ఆయన 50వ చిత్రం కావడం విశేషం. సందీప్‌కిషన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ఇండియా చిత్రం జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన తొలిపాటను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. ‘తలవంచి ఎరగడే..’ అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాయగా, ఏ.ఆర్.రెహమాన్ స్వరపరిచారు. శరత్సంతోష్ ఆలపించారు.
ధనుష్ ఓ ఉత్సవంలో కొందరు గ్రామస్థులతో కలిసి మాస్ డాన్స్ చేస్తూ ఈ పాటలో కనిపించారు. రెహమాన్ సంగీతానికి ప్రభుదేవా కొరియోగ్రఫీ తోడవ్వడం వల్ల ఈ పాట కొత్త అందాన్ని సంతరించుకుందని, మాస్‌తో పాటు అన్ని వర్గాలకూ నచ్చే సినిమా ఇదని మేకర్స్ తెలిపారు. ఎస్.జె.సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఓం ప్రకాశ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

