e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం

చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం

చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం

భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో.. భారతదేశం మువ్వన్నెల జెండాకు 1947 లో సరిగ్గా ఇదేరోజున రాజ్యంగ సభ ఆమోదం తెలిపింది. దీనికి ముందు ఢిల్లీలోని కానిస్ట్యూషన్‌ హాలులో జరిగిన సమావేశంలో స్వతంత్య్ర భారతదేశానికి జెండాను స్వీకరించాలని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించారు. దీనిపై తీవ్రమైన చర్చ జరిపిన మీదట అప్పటి కాంగ్రెస్‌ జెండా అయిన మువ్వన్నెల జెండాలో కొద్దిగా మార్పులు చేసి సభ ఆమోదించింది. ఈ జెండాలో కుంకుమ రంగుతోపాటు తెలుపు, ఆకుపచ్చ రంగులు, మధ్యలో చర్కాకు బదులుగా ఆశోక చక్రకు స్థానం కల్పించారు. ఈ క్రెడిట్‌ అంతా తెలుగు వాడైన పింగలి వెంకయ్యకే దక్కుతుంది. ఎందుకంటే ఈ జెండాకు రూపకల్పన చేసింది ఆయనే.

గాంధీజీతో సమావేశమైన సందర్భంలో తెలుపు రంగు మధ్య చర్కా ఉండేలా జెండా రూపకల్పన చేశారు. ఈ జెండాను అప్పట్లో ప్రతీ ఉద్యమంలో వినియోగించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సుభాష్ చంద్ర బోస్‌ కూడా ఇదే జెండాను తన పోరాటానికి గుర్తుగా ఉపయోగించారు. అయితే, చర్కా స్థానంలో అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించేలా చిహ్నాలు తీసుకురావాలన్న డిమాండ్‌ అన్ని వైపుల నుంచి వచ్చింది. దాంతో జెండాలో కొద్దిపాటి మార్పులు చేసి మూడు రంగులు, మధ్య చర్కాతో జెండాను స్వాతంత్య్రోద్యమంలో వాడారు.

- Advertisement -

భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత 1947 జూలై నెలలో జెండాకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని రాజ్యంగ సభ ఆలోచించింది. ఈ సమావేశంలో మువ్వన్నెల జెండాను యధాతథంగా తీసుకోవడంతోపాటు చర్కా స్థానంలో ఆశోక చక్రను తీసుకొచ్చి ఆమోదం తెలిపారు. జెండాలోని రంగులు శౌర్యం, నిజాయితీ, శాంతి, భూమితో సంబంధం వంటి వివరణలతో రాజ్యాంగ సభ ప్రకటించింది. మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మానికి, వేగానికి ప్రతిరూపంగా పేర్కొన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేయడానికి కొన్ని నిబంధనలను ఏర్పాటుచేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిబంధనల మేరకే ఎవరైనా జాతీయ జెండాను ఎగురవేయడం, అవనతం చేయడం జరుపాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2019: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-2 ప్రయోగం

2012: భారతదేశం 13 వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నిక

2009: 21 వ శతాబ్దంలో అతి పొడవైన సూర్యగ్రహణం సాక్షాత్కారం

1991: 17 మందిని హత్య చేసి తిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ డెమార్‌ను అరెస్ట్‌ చేసిన అమెరికా పోలీసులు

1942: మానవ చరిత్రలో అత్యంత క్రూరమైన, వ్యవస్థీకృత ఊచకోత జర్మనీలో నిర్వహణ

1933: విమానం ద్వారా ప్రపంచ ప్రదక్షిణ చేసిన మొదటి వ్యక్తిగా నిలిచిన విల్లీ హార్డెమాన్ పోస్ట్

1775: అమెరికా ఆర్మీకి నాయకత్వ బాధ్యతలు చేపట్టిన అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్

ఇవి కూడా చ‌ద‌వండి..

రహస్య చట్టంలో మార్పులకు బ్రిటన్‌ సన్నాహాలు

రాజ్‌కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?

ఇంట్లో ఫోన్‌ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం
చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం
చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం

ట్రెండింగ్‌

Advertisement