IndiGo Flight : బెంగళూరు నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో పొగలు రావడంతో విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికుల్ని సురక్షితంగా దించివేశారు. ఈ ఘటన మంగళవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి ఇండిగో సంస్థకు చెందిన 6ఈ–6017 అనే విమానం మంగళవారం చెన్నై బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది.
రన్‌వేపై బయల్దేరడానికి కొద్ది సేపటి ముందు క్యాబిన్లోంచి పొగలు వచ్చాయి. ఇది గమనించిన పైలట్లు అత్యవసరంగా విమానాన్ని నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికుల్ని విమానం నుంచి సురక్షితంగా దించివేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికుల క్షేమమే తమ మొదటి ప్రాధాన్యమని సంస్థ తెలిపింది.
IndiGo 6E-6017 from Bangalore to Chennai starts pushing back and taxiing, then smoke shows up in the cabin. Full emergency evacuation right there on the tarmac. Everyone’s safe. IndiGo already got an alternate plane ready and even serving refreshments while folks wait pic.twitter.com/JP9ZQgGLXU
— Fahad Naim (@Fahadnaimb) May 26, 2026
ఇదే సమయంలో విమానం ఆలస్యం కావడంతో వారికి ఆహారం ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రకటించింది. అనంతరం మరో విమానాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల్ని అందులో చెన్నై పంపించారు. మరోవైపు విమానంలో పొగలు రావడానికి గల కారణాలపై అధికారులు, నిపుణులు ఆరా తీస్తున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు.