CM Siddaramaiah : గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాలకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. ముఖ్యమంత్రి మార్పు అంటూ జరుగుతున్న ప్రచారం చివరకు నిజమయ్యేలా ఉంది. సీఎం కుర్చీ కోసం పట్టుబడుతున్న డీకే శివకుమార్(DK Shiv Kumar) తన పంతం నెగ్గించుకోవడమే అందుకు కారణం. దాంతో.. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య (Siddaramaiah) సీఎం పదవికి ఒకట్రెండు రోజుల్లో రాజీనామా చేయనున్నారని సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల తర్వాత డీకే శివకుమార్‌కు కట్టబెట్టేందుకు సిద్ధరామయ్య అంగీకరించారు. కానీ, సీఎం అయ్యాక ఆయన కుర్చీని వదిలే ప్రసక్తే లేదని తేల్చేశారు. దాంతో, శివకుమార్ వర్గం సీఎం మార్పు కోసం ఢిల్లీలో పలుమార్లు లాబీయింగ్ చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం అధిష్ఠానంతో శివకుమార్ వర్గం, సిద్ధరామయ్య వర్గం వేర్వేరుగా భేటీ అయింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్నాటక ఇంఛార్జి రణ్‌దీప్ సుర్జేవాలాలు ఓబీసీ ప్రతినిధిగా రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్టు సిద్ధరామయ్యను తెలియజేశారు.
#BreakingNews | Karnataka CM Siddaramaiah is likely to resign by Friday amid Congress’ leadership churn. Sources say he may be accommodated with a Rajya Sabha seat as Dy CM DK Shivakumar eyes the top post@tushar15 shares his views @harishupadhya and @_pallavighosh decode more… pic.twitter.com/O2X6JhawqG
— News18 (@CNNnews18) May 26, 2026
తద్వారా ద్వారా దేశ రాజకీయాల్లో, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేలా ఆయనను ఢిల్లీ పెద్దలు ఒప్పించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని సిద్ధరామయ్య అంతర్గతంగా వెల్లడించాడని టాక్. రాష్ట్రానికి తిరిగొచ్చాక బుధవారం సిద్ధరామయ్య మీడియా సమావేశంలో తాను రాజ్యసభకు వెళ్లబోతున్నాననే విషయాన్ని ప్రకటించే అవకాశముంది. ఆయన మే 28న గురువారం గవర్నర్‌కు తన రాజీనామా సమర్పిస్తారని, అనంతరం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని కర్నాటక కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.