Palakurthy | ధాన్యం అన్ లోడింగ్‌లో తీవ్ర జాప్యం.. మిల్లర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం..!
పాలకుర్తి: ధాన్యం అన్ లోడింగ్ కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మిల్లర్లను హెచ్చరించారు.
పాలకుర్తి: ధాన్యం అన్ లోడింగ్ కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మిల్లర్లను హెచ్చరించారు. నియోజకవర్గంలో పాలకుర్తి అంతర్గాన్ మండలంలోని మిల్లర్ యజమానులు తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎమ్మెల్యే అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
కన్నాలలోని గణపతి రైస్ మిల్లును ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ఒక్క లారీ కూడా మిల్లు వద్ద ఉండకూడదని, వెంట వెంటనే అన్ లోడింగ్ చేసి పంపించాలని ఆయన సూచించారు. వారం రోజుల్లో పాలకుర్తి మండలంలో ధాన్యం కొనుగోలు 100 శాతం పూర్తి చెయ్యాలని తాహసిల్దారును ఎమ్మెల్యే ఆదేశించారు.

తనిఖీల సమయంలో ఎమ్మెల్యే వెంట సర్పంచులు సురారామ, పెద్దపల్లి తిరుమల, నాయకులు గంగాధర రమేష్ గౌడ్, ముక్కెర శ్రీనివాస్ గౌడ్, సుర సమ్మయ్య, పాత రవీందర్, కరుణాకర్ రెడ్డి, తువ్వ సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

