Michael Jackson | పాప్ ప్రపంచంలో తనదైన మూన్‌వాక్ డాన్స్‌తో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ బయోపిక్ ‘మైఖేల్’ ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది.
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి రానుంది. మైఖేల్ జాక్సన్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లోని పిపాక్ హబ్ (Peacock Hub)లో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలోనూ ఈ చిత్రాన్ని వీక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జియోహాట్‌స్టార్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ప్యాన్ గ్లోబల్ స్థాయిలో ఆకట్టుకున్న ఈ సంగీత దృశ్యకావ్యంలో మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన అల్లుడు జాఫర్ జాక్సన్ అద్భుత నటనతో అలరించారు. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవడంతో సంగీత ప్రియులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
He turned the moonwalk into a permanent flex.
Celebrate Michael Jackson’s birthday with Michael, premiering 29th August on the Peacock Hub on JioHotstar.
Available in English & Hindi. pic.twitter.com/HXQxh8clWr
— JioHotstar (@JioHotstar) July 28, 2026