TAUK Bonala Jathara | లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుండి సుమారు 2500కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు నాయకత్వంలో ప్రారంభమైన వేడుకలకు, వ్యాఖ్యాతలుగా ప్రధాన కార్యదర్శిశ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్ పర్సన్ గణేష్ కుప్పాల వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హై కమీషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ ఇతర అతిథులు పాల్గొన్నారు.
స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని,. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముఖ్య అతిథులు తెలిపారు.
టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం అయ్యేలా కృషి జరుగుతుందంటే దానికి కారణం మన ప్రత్యేక రాష్ట్రం మనకు ఏర్పాటు అవడమేనని, కాబట్టి అన్ని సందర్భాల్లో రాష్ట్ర ఏర్పాటు కొరకై ముందుండి నాయకత్వం వహించిన ఉద్యమ శిఖరం రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ను మనం అన్ని సందర్భాల్లో గుర్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే బోనాలు శుభాకాంక్షలు తెలిపి, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని కార్యవర్గాన్ని అభినందించారు. మన రాష్ట్ర పండగని మరింత వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ ,తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచం లో ఉన్నతెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టాక్ సంస్థని అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలంకు కృతఙ్ఞతలు తెలిపారు.
మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు..
సంస్థ ఉపాద్యక్షురాలు శుషుమన రెడ్డి మాట్లాడుతూ.. టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరూ బోనాలతో మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు.
ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ.. బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం అన్న తన సహకారం, సూచనలు, స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నాం అని తెలిపారు. టాక్ ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వంగా ఉందని, ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు – బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
టాక్ అడ్వైజరి చైర్మన్ మట్టా రెడ్డి మాట్లాడుతూ.. బోనాల జాతర వేడుకల విజయానికి కృషి చేసిన సహకరించిన స్థానిక ప్రభుత్వ యంత్రంగానికి, టాక్ కార్యవర్గానికి, స్థానిక సంస్థలకు, అతిధులకు, అలాగే హాజరై ప్రోత్సహించిన ఎన్నారై మిత్రులకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న అతిథుల్ని ఇతర సంస్థల్ని ప్రతినిధులని, స్పాన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లను, అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో ప్రసంశించారు.
ఈ కార్యక్రమంలో టాక్ అద్యక్షుడు రత్నాకర్ కడుదుల, శుష్మున రెడ్డి, సుప్రజ పులుసు, అశోక్ దూసరి, నవీన్ రెడ్డి ,గణేష్ కుప్పాల, పవిత్ర, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగిళి, సత్య చిలుముల, మట్టా రెడ్డి, , రవి రేతినేని , రవి ప్రదీప్ పులుసు , మల్లా రెడ్డి, , గణేష్ పాస్తాం , శ్రీకాంత్ జెల్ల , నాగరాజు తౌటం, శ్రీధర్ రావు , శైలజ జెల్ల ,స్నేహ , విజయ లక్ష్మి , శ్వేతా మహేందర్ , స్వాతీ , క్రాంతి , శ్రీ విద్య , దివ్య, ప్రవీణ్ వీర, మని తేజ , నిఖిల్ రెడ్డి , హరి గౌడ్ , రంజిత్ , రాజేష్ వాక, మాధవ రెడ్డి , అంజన్, తరుణ్ లూణావత్, సందీప్ , ఆనంద్ , లత , పావని , కార్తీక్ ,స్నేహ, అమరేశ్వరి, సాయి రావు,జస్వంత్ , ప్రశాంత్, వినోద్ నవ్య , ఉమా , తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.







Tauk Bonala Jathara 4

