fee reimbursement: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల అమలులో విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి విద్యార్థులపై పగబట్టింది. ఫీజ్ రీయింబర్స్మెంట్(fee reimbursement) కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) షాకిచ్చారు. ఆది నుంచి ఈ అంశంపై దాటవేస్తున్న సీఎం నేను ఇవ్వను అని కుండబద్ధలు కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడంలేదు తెలంగాణలో నేను కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వను అని మీడియా ముందే రేవంత్ రెడ్డి చెప్పేశారు.
ఫీజ్ రీయింబర్స్మెంట్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తప్పించుకునే ధోరణి మరోసారి బయటపడింది. పలుమార్లు సమాధానం దాటవేసిన సీఎం ఈసారి మీడియా ముందు నేను ఇవ్వను అని తేల్చేశారు. ఆర్.కృష్ణయ్య ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వమని అడగాలి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఏపీలో కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉంది. ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇచ్చాక తెలంగాణ బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శించండి అని సీఎం పేర్కొన్నారు.
ఏపీలో ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదు నేను కూడా ఇవ్వను
ఫీజ్ రీయింబర్స్మెంట్ అంశంపై రేవంత్ రెడ్డి తప్పించుకునే ధోరణి
ఆర్.కృష్ణయ్య ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వమని అడగాలి
ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఏపీలో కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్ పెండింగ్… pic.twitter.com/zpA7utPlTa
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2026