Prof K Nageshwar : ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్(Prof K Nageshwar)ను అరెస్టు చేస్తారనే వదంతులకు చెక్ పడింది. నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయొద్దని తానే స్వయంగా పోలీసులకు చెప్పానని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pavan Kalyan) అన్నారు. ఈ విషయంపై మరోసారి స్పందిస్తూ .. ‘ఇవాళ కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్తున్నారని తెలిసింది. నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయడం వంటివి వద్దని వారికి చెప్పాను. పాపం ఆయనంటే నాకిష్టం. పొరపాటున అలా అన్నారేమో వదిలేయమని చెప్పా’ అని రాజమండ్రి పార్టీ సమావేశంలో పవన్ కల్యాణ్ అన్నారు.
సామాజిక విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌కు ఊరట లభించింది. జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నాదేండ్ల మనోహర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను అరెస్ట్ చేస్తారనే వార్తలన్నీ అవాస్తమేనని తేలింది. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతించిన పవన్ కల్యాణ్ అరెస్ట్ వద్దని పోలీసులకు చెప్పారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ ని ఇబ్బంది పెట్టొద్దు.
పొరపాటు జరిగింది అని ఒప్పుకున్నాడు వదిలేయండి అని చెప్పాను.Sir @PawanKalyan by his nature pic.twitter.com/MmoBef3CgI
— Twood Trolls ™ (@TwoodTrolls_2_0) May 26, 2026
అంతకుముందు.. తనపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని నాగేశ్వర్ డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు. నేను చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే వెనక్కి తీసుకున్నాను. నేను విత్‌డ్రా చేసుకోవడాన్ని జనసేన పార్టీ కూడా స్వాగతించింది. ఏపీ పోలీసులు ఆనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. నాకు ఎలాంటి ఫోన్ చేయలేదు అని నాగేశ్వర్ తెలిపారు. నాగేశ్వర్‌పై ఎఫ్ఐఆర్లు నమోదైనందున ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. దాంతో, ఆయన ఇంటివద్ద తెలంగాణ పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.