e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News ఇంట్లో ఫోన్‌ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!

ఇంట్లో ఫోన్‌ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!

ఇంట్లో ఫోన్‌ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!

సీట్లో కూర్చుండి బటన్‌ నొక్కితే డోర్లు తెరుచుకునే, మూసుకునే కార్లు వచ్చేశాయ్‌..! కార్లోనే బార్‌ ఏర్పాట్లు మనల్ని ముంచెత్తుతున్నాయ్‌..! రాన్నున్న రోజుల్లో కార్లు మరింత టెక్నాలజీని అందిపుచ్చుకుని మనల్ని అలరించనున్నాయి. ఇంట్లో ఫోన్‌ మర్చిపోతే ఇకపై వర్రీ అవాల్సన పనిలేదంటున్నారు ఓ కార్ల కంపెనీ యాజమాన్యం. రోడ్డుపై పోతుండగా పెడస్ట్రియన్‌ లేన్‌ దాటితే మిమ్మల్ని హెచ్చరిస్తుందని మరో కంపెనీ యాజమాన్యం చెప్తోంది. రోడ్డుపై వార్నింగ్‌ సైన్‌బోర్డుల గురించి కూడా మనల్ని అలర్ట్ చేసే కార్లు రానున్నాయి. భవిష్యత్ కార్లు ఎలా ఉండనున్నాయో చికాగోలో జరిగిన ఆటో షో చూస్తే తెలిసిపోతుంది.

కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన తర్వాత తొలిసారిగా అమెరికాలోని చికాగోలో ఆటో షో నిర్వహించారు. ఈ షోలో భవిష్యత్‌లో రోడ్లపైకి వచ్చే అత్యాధునిక కార్లను ప్రదర్శించారు. కార్ల తయారీదారులు తమ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న కార్లను ప్రవేశపెట్టారు. డ్రైవింగ్ సౌకర్యవంతంగా చేయడంతో పాటు కొత్త కార్లలో వినియోగదారుల భద్రతపై చాలా శ్రద్ధ పెట్టినట్లుగా తెలుస్తున్నది. మెక్‌కార్మిక్ ప్లేస్‌లో జరిగిన 113 వ చికాగో ఆటో షో సందర్భంగా వేయికిపైగా కొత్త కార్లు, ట్రక్కులు, ఎస్‌యూవీలను వినియోగదారులకు పరిచయం చేశారు. నాలుగు ఇండోర్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేసి అవుట్‌డోర్ రైడ్-అండ్-డ్రైవ్ అవకాశాలు కూడా కల్పించారు.

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ / ఆర్

- Advertisement -

గోల్ఫ్ సిరీస్‌లో భాగంగా వోక్స్‌వ్యాగన్‌ సంస్థ జీటీఐ, ఆర్ అనే రెండు కార్లను ప్రవేశపెట్టింది. ఇద్దరికీ డ్రైవర్ అసిస్టెన్స్ టెక్ సూట్ అందుబాటులో ఉంటుంది. వీటిలో సెమీ ఆటోమేటెడ్ డ్రైవింగ్, పార్కింగ్ ఆప్షన్స్‌ కూడా ఉన్నాయి. ఢీకొనడం, ఢీకొనే హెచ్చరికలు, ఆటోమేటెడ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ పర్యవేక్షణ, లేన్ దాటితే హెచ్చరిక, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి భద్రతా లక్షణాలు ఉన్నాయి. ఆర్ మోడల్ 30 కలర్ యాంబియంట్ లైటింగ్‌తో వస్తుంది. ఏదైనా కారు ముందు భాగంలోకి రాగానే లైట్లు ఆటోమేటిక్‌గా తక్కువ బీమ్‌కే చేరుకుంటాయి. అలాగే, డోర్స్‌ ఆటోమేటిక్‌గా తెరుచుకుంటాయి. ఈ మోడల్ ధర రూ.23-36 లక్షల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి.

లెక్సస్ ఎన్ఎక్స్ 2022

ఇది హైబ్రిడ్ మోడల్‌కారు. డోర్లు ఎలక్ట్రానిక్ మెకానిజంను కలిగి ఉన్నాయి. డోర్లను తాకగానే నెమ్మదిగా తెరుచుకుంటాయి. డ్రైవర్ కళ్ళపై హైబీమ్‌ లైట్లు పడకుండా కారు ఎదురుగా రాగానే ఆటోమేటిక్‌గా లో బీమ్‌కు చేరుతాయి. రాత్రుల్లో గుర్తించేందుకు వీలుగా, ఎదురుగా కారు వస్తుందని తెలియడానికి ఈ కారు కొంత భాగంలో లైట్‌ ఉంటుంది. పాదచారులను గుర్తింపు, బ్రేకింగ్ లక్షణం కూడా ఉన్నది. అంతర్‌ నిర్మిత సిమ్ 5 జీ టెక్నాలజీతో స్మార్ట్ పరికరంగా కూడా పనిచేస్తుంది. ఈ మోడల్ ధర రూ.67 లక్షల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి.

బీఎండబ్ల్యూ IX

రాడార్, సెన్సార్లు, కెమెరాలు గ్రిల్‌లో అమర్చారు. ఫ్యూచరిస్టిక్ క్యాబిన్ ఉంటుంది. దీనిలో కంపెనీ మొదటిసారి ఆరు కోణాల స్టీరింగ్ అందుబాటులోకి తెచ్చింది. సిమ్ 5 జీ టెక్నాలజీ అంతర్‌ నిర్మితంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ కారును స్మార్ట్ పరికరంగా మారుస్తుంది. అంటే మీరు ఇంట్లో ఫోన్‌ మరచిపోతే కంగారుపడాల్సిన పనిలేదు. కారు ద్వారా మెసేజ్‌లు పంపడం, కాల్‌ చేయడం, స్వీకరించడం మాత్రమే కాకుండా డాటాను యాక్సెస్ చేసుకునే వీలున్నది. ఈ మోడల్ ధర రూ.64 లక్షల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

భారత్‌తో సంబంధాలు కోరుకుంటున్నాం: నేపాల్‌ ప్రధాని డ్యూబా

మెక్సికో మాజీ అధ్యక్షులపై ఆగస్టు 1 న రెఫరెండం

సిద్ధమైన 3 డీ ప్రింటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జ్‌.. ఎక్కడో తెలుసా..?

నటి కరీనా కపూర్‌ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’పై ఫిర్యాదు

చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం

ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంట్లో ఫోన్‌ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!
ఇంట్లో ఫోన్‌ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!
ఇంట్లో ఫోన్‌ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!

ట్రెండింగ్‌

Advertisement