Talasani Srinivas yadav | సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. నాకు అధికారం ఉన్నది.. నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అధికారం మాకు ఏమన్నా కొత్తనా..? అని అన్నారు. కేసీఆర్ 45 సంవత్సరాలకాలంలో నిరంతరం గెలిచిన నాయకుడే కదా.. కేంద్రమంత్రిగా చేసిన నాయకుడు కదా.. ఆ రోజు కేసీఆర్ నీలాగా విర్రవీగలే కదా.. ఎవరు విర్రవీగినా చరిత్రలో అది రాసి పెట్టి ఉంటది. సందర్భం వచ్చినప్పుడు జరుగుతది. కానీ ఒక్కసారి కాంగ్రెస్ వచ్చిపోతే 30-35 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఈ దేశంలో కనిపియ్యదన్నారు.
ప్రజలు సంతోషంగా ఉండాలనేది మన కేసీఆర్ కోరిక. కానీ ఇప్పుడొచ్చిన ప్రభుత్వం.. ఆయన (రేవంత్ రెడ్డి) అంట కేసీఆర్ ఆనవాళ్లు చెరపేస్తడంట. సెక్రటేరియట్ ఎవరు కట్టారు, వాళ్ల అయ్య జాగీరుదా..? మరి సెక్రటేరియట్లో కేబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నవ్..? సెక్రటేరియట్ పక్కనే ప్రపంచంలోనే ఎక్కడా లేనట్వంటి అంత పెద్ద 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎవరు కట్టారు, నువ్వు పోయి కూర్చుంటున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ఎవరు కట్టారు, నువ్వు ఈరోజు ప్రజాభవన్ అని పిలుస్తున్న ప్రగతి భవన్ ఎవరు కట్టారు, ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరూ.. కేసీఆర్ అని అన్నారు. మరి ఆయన ఆనవాళ్లు ఎలా తీస్తావు.. అని తలసాని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు
సెక్రటేరియట్ ఎవరు కట్టారు, 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎవరు కట్టారు, నువ్వు పోయి కూర్చుంటున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ఎవరు కట్టారు, నువ్వు ఈరోజు ప్రజాభవన్ అని పిలుస్తున్న ప్రగతి భవన్ ఎవరు కట్టారు, ఒక రాష్ట్రాన్ని… pic.twitter.com/c9CUwLtkWh
— Telugu Scribe (@TeluguScribe) May 31, 2026
Naga Chaitanya | నీతో జీవితాన్ని పంచుకోవడం నా అదృష్టం.. శోభిత బర్త్‌డేపై నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu | ఎప్పటికీ మీరే నా హీరో నాన్న .. కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్
ముగ్గురు స్నేహితులను కాపాడి కాపాడి ఆ పై తాను మృతి చెంది..అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి