Sanjay Gupta | ‘A’ సర్టిఫికేట్ సినిమాను పిల్లలు చూస్తున్నారు.. హాలీవుడ్ సినిమాపై బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా ఆవేదన
కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో మొదటిరోజే వరల్డ్ వైడ్‌గా రూ.950 కోట్ల వసూళ్లను సాధించి హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'అబ్సెషన్' (Obsession) చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా.
Obsession | కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో మొదటిరోజే వరల్డ్ వైడ్‌గా రూ.950 కోట్ల వసూళ్లను సాధించి హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘అబ్సెషన్’ (Obsession) చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ‘ఎ’ (A-Rated) సర్టిఫికేట్ పొందిన హాలీవుడ్ హర్రర్ చిత్రం ‘అబ్సెషన్’ (Obsession) ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రాన్ని చూడటానికి మైనర్ పిల్లలు ( 18 ఏండ్ల కంటే తక్కువ) భారీ సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారని సంజయ్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన ఒక మలయాళ సినిమాను చూసేందుకు తాను థియేటర్‌కు వెళ్లానని, ఆ స్క్రీన్‌లో కేవలం తాను ఒక్కడినే ఉన్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అయితే అదే థియేటర్లోని పక్క స్క్రీన్‌లో ప్రదర్శితమవుతున్న ‘అబ్సెషన్’ సినిమాకు తన కుమారుడు వెళ్లాడని, అక్కడ థియేటర్ మొత్తం పిల్లలతో నిండిపోయిందని ఆయన తెలిపారు. వారిలో చాలా మంది 18 ఏండ్ల కంటే తక్కువ వయసు వారే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని, అయితే ‘ఎ’ రేటింగ్ ఉన్నప్పటికీ మైనర్లు ఎలా లోపలికి ప్రవేశిస్తున్నారనే దానిపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘అబ్సెషన్’ చిత్రం తీవ్రమైన హింస మరియు అడల్ట్ కంటెంట్ కారణంగా సెన్సార్ బోర్డ్ నుంచి దాదాపు 38 సెకన్ల కీలక సీన్ల కత్తెరకు గురైనప్పటికీ, సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాలు నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

