న్యూఢిల్లీ: భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 498ఏ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తరించింది. భర్త లేదా అతని బంధువులు చేసే వేధింపులకు సంబంధించిన ఈ నిబంధన.. పెండ్లి చేసుకునే ఉద్దేశం కలిగి, సహజీవనంలో ఉన్న భాగస్వాములకు కూడా వర్తిస్తుందని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో సహజీవన జీవన విధానాన్ని ఎంచుకునేవారికి న్యాయ సేవ అందించేందుకు చట్టం కూడా మారుతున్న కాలానుగుణంగా రూపాంతరం చెందాలని ధర్మాసనం పేర్కొంది.
పెండ్లితో సమానమైన ధోరణిలో సహజీవనం ఉన్నప్పుడు మాత్రమే మహిళను వేధిస్తే చట్టాలు వర్తిస్తాయని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.