Amit Shah | ఇండియాకు నార్కోటిక్ కింగ్‌పిన్ నవ్‌ప్రీత్ సింగ్.. టర్కీని ఒప్పించి తీసుకొచ్చిన కేంద్రం
Amit Shah : టర్కీలో ఉంటున్న డ్రగ్స్ అక్రమ వ్యాపారి నవ్‌ప్రీత్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఇండియా తీసుకువచ్చింది. ఈ మేరకు టర్కీ ప్రభుత్వాన్ని కేంద్రం ఒప్పించింది. ఈ విషయాన్ని కేంద్రం హోం మంత్రి అమిత్ షా శనివారం వెల్లడించారు.
Amit Shah : టర్కీలో ఉంటున్న డ్రగ్స్ అక్రమ వ్యాపారి నవ్‌ప్రీత్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఇండియా తీసుకువచ్చింది. ఈ మేరకు టర్కీ ప్రభుత్వాన్ని కేంద్రం ఒప్పించింది. ఈ విషయాన్ని కేంద్రం హోం మంత్రి అమిత్ షా శనివారం వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. మోదీ అధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అక్రమ డ్రగ్స్ వినియోగాన్ని ఎంతమాత్రం సహించబోదన్నారు. 2029లోపు దేశంలో డ్రగ్స్ ముఠాలను అంతం చేయాలనేది మోదీ ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా అన్నారు.
ఇప్పటికే నవ్‌ప్రీత్ సింగ్‌ను ఇండియా తీసుకొచ్చామని, ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని అమిత్ షా తెలిపారు. నవ్‌ప్రీత్ అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్. ఆఫ్గనిస్తాన్ నుంచి హెరాయిస్ సహా విలువై, అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ను అతడు ఇండియా, టర్కీలకు సరఫరా చేస్తుంటాడు. ఇందుకోసం పెద్ద నెట్వర్క్ నిర్వహిస్తున్నాడు. అక్రమ డ్రగ్స్ వ్యాపారంలో ఎప్పటినుంచో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇండియాకు కూడా భారీ స్థాయిలో నిషేధిత మత్తు పదార్థాల్ని రవాణా చేస్తుంటాడు. ఇండియన్ అయిన అతడు ఇక్కడి నుంచి టర్కీ పారిపోయాడు.
Modi govt has achieved a historic milestone by securing the deportation of hardened narco-trafficking kingpin Navpreet Singh from Türkiye.
Obtaining Turkish citizenship under the fake identity of Navab Virk, he had continued to smuggle heroin and methamphetamine to India from…
— Amit Shah (@AmitShah) October 3, 2026
అక్కడ నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించుకున్న నవ్‌ప్రీత్ సింగ్.. టర్కీలో నవాబ్ విర్క్గా చెలామణి అవుతున్నాడు. దొంగ పత్రాలతో టర్కీ పౌరసత్వం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి స్థావరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అతడిని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఈ అంశంపై టర్కీ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. దీనికి టర్కీ అంగీకరించింది. దీంతో అతడిని కేంద్రం ఇండియా తీసుకొచ్చింది. నవ్‌ప్రీత్ సింగ్ చేసిన నేరాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. నవ్‌ప్రీత్ సింగ్ ఇండియాకు అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తుండగా.. ఇండియాలో అతడి దగ్గరి బంధువు ప్రభ్‌దీప్ సింగ్ ఈ డ్రగ్స్ రవాణా, వ్యాపారంలో పాలుపంచుకుంటాడు.
ప్రభ్‌దీప్ సింగ్‌ను గత మే లోనే దర్యాప్తు సంస్థలు ఇండియా తీసుకొచ్చాయి. అతడిపై రెడ్ నోటీస్ ఉండటంతో అజార్బైజాన్లో పట్టుబడ్డాడు. దీంతో ఢిల్లీ పోలీసులు, సీబీఐ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కలిసి అతడిని ఇండియా తీసుకొచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్ దృశ్యం..!
Muskan Rastogi | జైలులోనే ముస్కాన్ పది నెలల కూతురు.. దత్తత కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన ఇన్ఫ్లుయెన్సర్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్ దృశ్యం..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

