e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం

చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం

చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం

దేశంలో తమ రాజరికాన్ని కొనసాగించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాల్లో విభజించు.. పాలించు అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. బ్రిటిష్‌ వైస్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌ ఈ విధానానికి 1905 లో సరిగ్గా ఇదే రోజున శ్రీకారం చుట్టారు. ఈ విధానానికి భారతదేశం వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ బ్రిటిష్‌ రాజులు విభజించు.. పాలించు.. అనే తమ ఆలోచనలను మూడు నెలల అనంతరం 1905 అక్టోబర్‌ 16 న అమలు చేసి పశ్చిమ బెంగాల్‌ను ముక్కలుగా చేశారు. పశ్చిమ బెంగాల్‌ను విభజించి ప్రస్తుతం ఉన్న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంతోపాటు బిహార్‌, ఒడిశా, అసోం, బంగ్లాదేశ్‌లను ఏర్పాటుచేశారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ దీనిపై ఏకంగా ఒక దీర్ఘకవితనే రాసి తన వ్యతిరేకతను చాటారు. భారతదేశంలోని హిందూ-ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి బ్రిటిష్ వారు చేసిన అతిపెద్ద కుట్రగా పేర్కొనవచ్చు.

పశ్చిమ బెంగాల్‌ రాజ్యం చాలా పెద్దదిగా ఉండటం, జనాభా కూడా ఎక్కువగా ఉండటం వంటి సమస్యలతో పరిపాలన సక్రమంగా కొనసాగడం లేదన్న కారణాలతో విభజన చేసేందుకు నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్‌ రాజ్యాన్ని పరిపాలనకు అనువుగా ఐదు ముక్కలుగా చేశారు. అయితే, దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నదని ఆనాడే భారతీయులు గ్రహించారు. వాస్తవానికి, బెంగాల్ తూర్పు భాగంలో ముస్లిం ఆధిపత్యం ఉండగా, పశ్చిమ భాగంలో హిందువుల జనాభా ఎక్కువగా ఉన్నది. లార్డ్ కర్జన్ ముస్లిం మెజారిటీ తూర్పు బెంగాల్‌ను అసోంతో విలీనం చేసి ప్రత్యేక ప్రావిన్స్ ఏర్పాటుచేశారు. దీని ప్రధాన కార్యాలయం ఢాకాగా నెలకొల్పారు. మరోవైపు మిగిలిన బెంగాల్‌కు పశ్చిమ బెంగాల్ అని పేరు పెట్టారు. మొత్తంమీద రెండు ప్రావిన్సుల్లో రెండు వేర్వేరు మతాలను మెజారిటీ చేయడమే బ్రిటిష్ వారి లక్ష్యంగా ఉన్నది.

- Advertisement -

ఆ సమయంలో జాతీయ స్పృహకు బెంగాల్ కేంద్రంగా ఉండేది. ఈ స్పృహను నాశనం చేయడానికి లార్డ కర్జన్ బెంగాల్‌ను విభజించాలనుకున్నాడు. ఇది బ్రిటిష్ వారి విభజన-పాలన విధానం అని భారతీయులు అర్థం చేసుకున్నారు. దాంతో దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమం ప్రారంభమైంది. హిందూ-ముస్లింలను విభజించడాన్ని నిరసిస్తూ హిందువులు, ముస్లింలు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని ఐక్యతను చాటుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టింది. విదేశీ వస్త్రాలను దహనం చేయడం వంటి కార్యక్రమాలను పూనుకున్నారు. బ్రిటిష్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ‘అమర్‌ షోనార్‌ బంగ్లా’ అనే కవిత రాశారు. ఇదే కవిత తర్వాతి రోజుల్లో బంగ్లాదేశ్‌ జాతీయ గీతంగా మారింది. వీటన్నింటిని లెక్కచేయని బ్రిటిష్‌ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌ను ఐదుగా విభజించింది.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2005: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ నిర్ణయం తీసుకున్న కెనడా

1997: తీస్తా నది నీటిని పంచుకోవడంపై భారత్-బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం

1976: మార్స్ ఉపరితలంపైకి చేరిన అమెరికా తొలి అంతరిక్ష నౌక వైకింగ్

1969 : చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టడం ద్వారా చరిత్ర సృష్టించిన అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్

1968: మొదటి అంతర్జాతీయ ప్రత్యేక ఒలింపిక్ క్రీడలు చికాగోలో ప్రారంభం

1944: జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌పై దాడి

1296: జలాలుద్దీన్ ఖిల్జీ హత్య అనంతరం ఢిల్లీ పాలకుడిగా తనకు తాను ప్రకటించుకున్న అలావుద్దీన్ ఖిల్జీ

ఇవి కూడా చ‌ద‌వండి..

England Vs Pakistan | సిక్స్‌ కొడితే.. దద్దరిల్లిపోయింది..!

ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?

అమెరికన్‌ నేవీలో మహిళా శకం ఆరంభం

ఈసారి సెంట్రల్‌ వర్సిటీల్లో నేరుగా ప్రవేశాలు

ఒక్క వన్డే.. 10 రికార్డులు.. అవేంటంటే..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం
చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం
చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం

ట్రెండింగ్‌

Advertisement