అమెరికన్ నేవీలో మహిళా శకం ఆరంభం
అత్యంత కఠినమైన శిక్షణ కారణంగా మధ్యలోనే వదిలి వెళ్లిపోతుంటారు. అలాంటిది ఓ మహిళ ఈ కఠిన శిక్షణ పూర్తిచేసుకుని సెయిలర్‌గా నియమితురాలై చరిత్ర తిరగరాసింది.

వాషింగ్టన్ : నౌకాదళంలో ఉద్యోగం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందునా అమెరికా వంటి అగ్రరాజ్యానికి చెందిన నౌకా దళంలో ఉద్యోగం అంటే మాటలా..! అమెరికన్ నేవీలో చేరేందుకు ఎందరో తహతహలాడుతుంటారు. అయితే, అత్యంత కఠినమైన శిక్షణ కారణంగా మధ్యలోనే వదిలి వెళ్లిపోతుంటారు. అలాంటిది ఓ మహిళ ఈ కఠిన శిక్షణ పూర్తిచేసుకుని సెయిలర్‌గా నియమితురాలై చరిత్ర తిరగరాసింది.
అమెరికాకు చెందిన స్పెషల్ వార్ఫేర్ కాంబటాంట్ క్రాఫ్ట్ క్రూమ్యాన్ (ఎస్డబ్ల్యూసీసీ) లో సెయిలర్ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. అయితే, 37 వారాల పాటు ఎంతో కఠోరంగా సాగే ఈ సెయిలర్ ఉద్యోగాల శిక్షణలో ఏటా 65 శాతం మంది మధ్యలోనే వదిలేసి వెళ్తుంటారు. ఇంతటి కఠినమైన శిక్షణ అందే ఉద్యోగానికి ఒక మహిళ ఎంపికై విజయవంతంగా పురుషులతో సమానంగా శిక్షణ పూర్తి చేసుకుని అమెరికన్ నేవీ చరిత్రలో తన పేరును లిఖించుకున్నది. పెంటగాన్ పాలసీ ప్రకారం ఆ మహిళ పేరును అమెరికన్ నేవీ అధికారులు వెల్లడించలేదు.
ఇప్పటివరకు ఈ సెయిలర్ ఉద్యోగాల కోసం 18 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా.. 14 మంది మధ్యలోనే ఇంటి ముఖం పట్టారు. మరో ముగ్గురు మహిళలు ఇంకా శిక్షణ పొందుతున్నారు. ఆయుధాల వాడకం, నావిగేషన్, స్పీడ్‌బోటింగ్ జారవిడవడం, సముద్రలోతుల్లో నుంచి ఆక్సిజన్ లేకుండా బయటకు రావడం, ప్యారాచూట్ జంపింగ్ వంటి కఠోర శిక్షణ ఇస్తారు. చివరగా 72 గంటల పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఛాలేంజింగ్ ఎన్విరాన్మెంట్లో 23 గంటల పాటు రన్నింగ్, 5 మైళ్ల స్విమ్మింగ్ కూడా ఉంటుంది. ఇవి సెయిలర్స్ భౌతిక, మానసిక దృఢత్వాన్ని అంచనా వేయడానికి సహాయపడతాయి. ఈ శిక్షణ అనంతరం నేవీ సీల్స్ శిక్షణ పొందేందుకు అర్హత పొందుతారు. 2016 లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో భాగంగా నేవీలోకి మహిళలను తీసుకోవడం ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
ఈసారి సెంట్రల్ వర్సిటీల్లో నేరుగా ప్రవేశాలు
ఒక్క వన్డే.. 10 రికార్డులు.. అవేంటంటే..!
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్..! ఎందుకంటే..?
త్వరలో స్పేస్ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

