పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు మృత్యువాతకు గురయ్యారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు కూడాఉన్నారు

ముజఫ్పర్గఢ్ : పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు మృత్యువాతకు గురయ్యారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు కూడాఉన్నారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బక్రీద్ పండుగను సొంతూర్లలో జరుపుకునేందుకు వీరంతా బయల్దేరి వస్తూ ప్రమాదానికి గురయ్యారు.
ముజఫ్పర్‌గఢ్‌లోని డేరా ఘాజీ ఖాన్ వద్ద ఇండస్ హైవేపై ప్రైవేట్ బస్సు-కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 30 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా సొంతూర్లకు ప్రయాణమైన కార్మికులు సియాల్కోట్ నుంచి రజన్పూర్ కు ప్రైవేట్ బస్సులో ప్రయాణమయ్యారు. మరో గంటన్నరలో ఇంటికి చేరుతారనగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వీరంతంగా సియాల్కోట్లో దినసరి కార్మికులుగా పనిచేస్తున్నారు. బక్రీద్‌ను ఇంటి వద్ద జరుపుకునేందుకు బయల్దేరగా ఈ ప్రమాదానికి గురయ్యారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని పోలీసులు బయటకు తీసి దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని డేరా ఘాజీ ఖాన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ అంతర్గత శాఖ మంత్రి షేక్ రషీద్ అధికారులకు సూచనలు చేస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
ఈ టీచర్లు జిహదీలను తయారుచేస్తారంట..!
కృత్రిమ మేధస్సుకు మెదడు న్యూరాన్ల మోడల్ సృష్టి
సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్..! ఎందుకంటే..?
త్వరలో స్పేస్ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

