న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్లో సీజేపీ నిరసన ప్రదర్శన వేళ.. కొందరు యువత ప్రధాని మోదీని తిట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ వీడియో రిలీజ్ చేశారు. పిల్లలను క్షమిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తాజాగా ఆన్లైన్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి ప్రధాని మోదీకి క్షమాపణలు(Apology) చెప్పింది. గీతల టీషర్ట్ వేసుకున్న ఆ అమ్మాయి చేతులు జోడించి మాట్లాడింది. తన వయసు 15 ఏళ్ల మాత్రమే అని, కానీ జంతర్ మంతర్లో అక్కడున్న వారిని చూసి.. మోదీని తిట్టినట్లు ఆ అమ్మాయి పేర్కొన్నది. ప్రధాని మోదీ గురించి అనవసరంగా చెడు మాటలు మాట్లాడినట్లు ఆమె పేర్కొన్నది. కానీ పోలీసుల తమ ఎఫ్ఐఆర్లో ఆ అమ్మాయి వయసు 25 ఏళ్లుగా రాసినట్లు తెలిసింది. ఇదే తన మొదటి, చివరి తప్పు అని ఆ వీడియోలో అమ్మాయి పేర్కొన్నది. యావత్ దేశానికి క్షమాపణలు చెబుతున్నానని, సిగ్గుపడుతున్నానని, తనను తాను చూసుకోలేకపోతున్నానని, ప్లీజ్ నన్ను క్షమించండి అంటూ ఆ అమ్మాయి తెలిపింది.
నోయిడా పోలీసు స్టేషన్లో ఆ అమ్మాయిపై కేసు బుక్ చేసినట్లు వెల్లడైంది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నోయిడా పోలీసులు.. ఆ తర్వాత కేసును పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. అ అమ్మాయి తొలుత ఓ వీడియోలో చేసిన వ్యాఖ్యలు .. ప్రధాని మోదీని అగౌరవపరిచినట్లుగా ఉందని తెలిసింది. శాంతిని భంగపరిచే రీతిలో ఆ వీడియో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ప్రధాని మోదీ తన ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ వీడియలో మాట్లాడుతూ తనను దూషించిన వారిని క్షమిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ వారికి శిక్ష విధించడానికి బదులుగా మార్గనిర్దేశం చేయాలన్నారు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని యువతకు కల్పించాలన్నారు. తనను, తన తల్లిని దూషించడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. దేశం కోసం అందరం కలిసి ముందుకు సాగుదామని ఆయన పిలుపును ఇచ్చారు.
Ruchika Singh who abused PM Modi is now crying. she said
~ I am apologizing to the entire country. I am so ashamed that I cannot even lift my eyes. I am asking for forgiveness from everyone, please forgive me, please.
~ This is my first and last mistake. After this, I will… pic.twitter.com/41IhPx3MKb
— Veeru (@realveeru_) August 1, 2026