హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలుగా ఆదిబట్ల, Nadargul, ఎంఎం కుంట హార్డ్‌వేర్ పార్ ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి భూ యాజమానులకు హకులు కల్పించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహా డిమాండ్ చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, భూ యజమానుల సం ఘం ప్రతినిధి సత్యం పాల్గొన్నారు.