వాషింగ్టన్, సెప్టెంబర్ 29: భారత్‌కు చెందిన ఎస్సార్ గ్రూప్.. అమెరికాలో ఓ మెగా స్టీల్ ప్లాంట్‌ను నిర్మించబోతున్నది. దాదాపు 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) పెట్టుబడితో ఎస్సార్ గ్రూప్ అమెరికా అనుబంధ సంస్థ మెసాబి మెటాలిక్స్ దీన్ని ఏర్పాటు చేస్తున్నది.
ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. కాగా, లోవా రాష్ట్రంలో రానున్న ఈ ప్లాంట్ అమెరికాలోనే అతిపెద్దది కావడం విశేషం.