హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు విమర్శించారు. మంగళవారం బీజే పీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవుళ్లను పేద-ధనిక దేవుళ్లుగా విభజిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడటం సరికాదని చెప్పారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ముస్లిం ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి రాజకీయాలకు తెరలేపిందని ఆరోపించారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు.