హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కొడంగల్ బిడ్డనని చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గ ప్రజల ఇండ్లనే కూల్చివేయిస్తున్నారని మా జీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. మద్దూరులో రాత్రికి రాత్రే పేదల ఇండ్లపై బుల్డోజర్లను ఎక్కించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ బుధవా రం ‘ఎక్స్’ వేదిగా నిలదీశారు. బాధితులకు కనీసం ముందస్తు నోటీసు లు కూడా ఇవ్వకుండా, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను సైతం బే ఖాతరు చేస్తూ పోలీసులు అండతో ఇంత కరశంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఉన్నపలంగా ఇండ్లను నేలమట్టం చేస్తే వా రు ఎకడికి పోవాలని ప్రశ్నించారు. పేదల బతుకులను నడిరోడ్డున పడేయడమేనా ప్రజాపాలన అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చిందని గొప్ప గా చెప్పుకొనే భూసేకరణ చట్టం-2013 ప్రకారం.. బాధితులకు తక్షణమే చట్టబద్ధమైన, న్యాయమైన నష్టపరిహారం చెల్లించి, పునరావా సం కల్పించాలని డిమాండ్ చేశారు.