e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ

చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ

చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ

దేశవ్యాప్తంగా ఉన్న 14 బ్యాంకులను జాతీయం చేస్తూ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969 లో సరిగ్గా ఇదే రోజున ప్రకటించారు. బ్యాంకుల జాతీయం చేసి నేటికి సరిగ్గా 52 ఏండ్లు పూర్తయ్యాయి. ‘బ్యాంకింగ్‌ కంపెనీస్‌ ఆర్డినెన్స్‌’ పేరుతో చట్టం తీసుకొచ్చిన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలోని 14 ప్రైవేట్‌ బ్యాంకులను జాతీయం చేశారు. ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమె క్యాబినెట్‌లోనే ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ తీవ్రంగా వ్యతిరేకించడం విశేషం.

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం యూరప్‌లో బ్యాంకులు తీవ్ర నష్టాలను చవిచూశాయి. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను చక్కబరిచేందుకు పలు యురోపియన్‌ దేశాలు తమ దేశాల్లోని బ్యాంకులను జాతీయీకరణ చేశాయి. దీన్నే మన భారతదేశం ప్రభుత్వం కూడా అనుసరించి భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ)ను తొలుత 1949 లో జాతీయం చేశారు. అనంతరం 1969 జూలై 7 న బెంగళూరులో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో బ్యాంకుల జాతీయీకరణ తీర్మానాన్ని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రవేశపెట్టారు. దాంతో 1969 లో 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. సామాజిక అభివృద్ధిలో బ్యాంకులు తమ పాత్రను పోషించడం లేనందునే ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయాల్సి వచ్చిందని ఇందిరమ్మ వెల్లడించారు. వ్యవసాయం, చిన్నపరిశ్రమలు, ఎగుమతులు, పారిశ్రామికీకరణకు ఊతమిచ్చేందుకు, బలహీనవర్గాలను బలోపేతం చేసేందుకు ఆ చర్య తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే, ఇందిరమ్మ నిర్ణయాన్ని ఆమె క్యాబినెట్‌లో ఆర్థికమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్‌ చర్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

జాతీయం అయిన బ్యాంకులు ఇవే..

- Advertisement -

ఇందిరాగాంధీ జాతీయం చేసిన ప్రైవేట్‌ బ్యాంకుల్లో .. అలహాబాద్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, సిండికేట్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉన్నాయి. 1980 తర్వాత ఆంధ్రాబ్యాంకు తోపాటు మరో 13 బ్యాంకులను కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2010: కోల్‌కతాలో జరిగిన రైలు ప్రమాదంలో 63 మంది దుర్మరణం

1985: స్పేష్‌ మిషన్‌కు ఎంపికైన తొలి పాఠశాల ఉపాధ్యాయుడుగా క్రిస్టా మెక్‌ఆలిఫ్ రికార్డ్‌

1980: మాస్కోలో ఒలింపిక్స్ ప్రారంభం

1961: ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ విమానంలో ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు సినిమాల ప్రదర్శన ప్రారంభం

1952: ఇంగ్లండ్‌తో ఫాలో-ఆన్ ఆడుతూ కేవలం 82 పరుగులకే ఆలవుట్‌ అయిన టీమిండియా

1947: రంగూన్‌లో బర్మా ప్రధాని ఆంగ్ సేన్ దారుణ హత్య

1941 : తమ కార్టూన్‌ ఫిల్మ్‌కు టామ్‌ ఆండ్‌ జెర్రీగా నామకరణం చేసిన విలియం హన్నా, జోసెఫ్‌ బార్బరా

1903: 2,428 కిలోమీటర్ల పొడవున్న మొదటి టూర్ డీ ఫ్రాన్స్‌ను గెలుచుకున్న ఫ్రెంచ్ సైక్లిస్ట్ మారిస్ గెరిన్

1827: ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో మంగల్ పాండే జననం

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ టీచర్లు జిహదీలను తయారుచేస్తారంట..!

కృత్రిమ మేధస్సుకు మెదడు న్యూరాన్ల మోడల్‌ సృష్టి

షారుఖ్‌ఖాన్‌ చేసిన పనిని బయటపెట్టిన దినేశ్‌ కార్తీక్‌

సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్‌..! ఎందుకంటే..?

త్వరలో స్పేస్‌ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ

ట్రెండింగ్‌

Advertisement