e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News షారుఖ్‌ఖాన్‌ చేసిన పనిని బయటపెట్టిన దినేశ్‌ కార్తీక్‌

షారుఖ్‌ఖాన్‌ చేసిన పనిని బయటపెట్టిన దినేశ్‌ కార్తీక్‌

షారుఖ్‌ఖాన్‌ చేసిన పనిని బయటపెట్టిన దినేశ్‌ కార్తీక్‌

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ బాద్‌షాగా పేరుగాంచిన షారుఖ్‌ఖాన్‌ చేసిన ఓ పనిని క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ బయటపెట్టాడు. అందుకే షారుఖ్‌ అంటే తనకు ఎనలేని గౌరవమని, ఆయన కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమని కూడా ప్రకటించాడు దినేశ్‌ కార్తీక్‌. ఇటీవల గౌరవ్‌ కపూర్స్‌ పోస్ట్‌కార్డ్‌తో దినేశ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను తన అభిమానులతో పంచుకున్నాడు.

బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్‌ఖాన్‌ తాను చేసే మంచి పనులను మీడియా ద్వారా తన అభిమానులకు చెప్పడానికి కాస్తా మొహమాటపడుతుంటాడు. తన గురించి ప్రజలకు తెలిసినందున మళ్లీ చెప్పుకోవడం ఎందుకనే ఫిలాసఫీని అనుసరిస్తుంటారని సినీ విశ్లేషకులు చెప్తుంటారు. నిజమే, షారుఖ్‌ఖాన్‌కు దేశవిదేశాల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన చేసిన సహాయాలపై కూడా చర్చలు జరిగాయి. అయినప్పటికీ తనకు తానుగా ఇది చేశానని షారుఖ్‌ చెప్పడం మనం ఏనాడూ చూసి ఉండం. క్రికెట్‌పై తనకున్న అభిమానంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సహ యజమానికిగా వ్యవహరిస్తూ లోకల్‌ క్రికెటర్లకు ఆర్థికంగా, హార్ధికంగా ఆదుకుంటున్నాడు.

- Advertisement -

తన జీవితంలో ప్రైవేట్‌ జెట్‌ ఎక్కడం అంటే అంతకంటే మరోటి లేదని, అది కూడా షారుఖ్‌ దాదా పర్సనల్‌ జెట్‌ ఎక్కి తన జన్మను ధన్యం చేసుకున్నా అని గౌరవ్‌ కపూర్స్‌ పోస్ట్‌కార్డ్‌తో మాట్లాడిన దినేశ్‌ కార్తీక్‌ తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తాను చెన్నైలో ఉన్న సమయంలో దుబాయ్‌ వెళ్లేందుకు తన ప్రైవేట్ జెట్‌ను తన కోసం షారుఖ్‌ దాదా పంపించాడని, ఇంతకన్నా ఆయన ఔదార్యత గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది అని అన్నారు. పర్సనల్‌ లైఫ్‌లో సమస్యలు ఎదురై ఆటుపోట్లకు గురైన సందర్భంలో తనకు అండగా నిలిచి ఆదుకున్నారని, ప్రపంచంలో ఆయనకన్నా గొప్ప హృదయం గల వారు ఇంకెవరూ లేరని దినేశ్‌ కార్తీక్‌ చెప్పారు. ఇలాంటి వ్యక్తి ప్రపంచానికి అవసరమని, ఆయన రీల్‌ జీవితంలోనే కాకుండా రియల్‌ జీవితంలో కూడా హీరోనే అని కొనియాడారు. తనకు అండగా నిలిచిన షారుఖ్‌ఖాన్‌ కోసం ఏదైనా చేయడానికి సదాసిద్ధమని చెప్పుకొచ్చారాయన.

కత్రీనాకైఫ్‌, అనుష్కా శర్మతో జతకట్టి షారుఖ్‌ఖాన్‌ నటించిన ‘జీరో’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్నది. ప్రస్తుతం ఆయన దీపికా పదుకునే, జాన్‌ అబ్రహంతో కలిసి పఠాన్‌ సినిమాలో నటించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్‌..! ఎందుకంటే..?

ఆఫ్ఘాన్‌లోకి జిహదీలను పంపారు : పాక్‌పై ఘనీ ఘాటు వ్యాఖ్య

త్వరలో స్పేస్‌ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..

కరోనా ట్రైలరే.. ముందుంది ముసళ్ల పండుగ : రిచర్డ్‌ సెనెట్‌

చరిత్రలో ఈరోజు.. భారత స్వాతంత్య్ర చట్టానికి బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
షారుఖ్‌ఖాన్‌ చేసిన పనిని బయటపెట్టిన దినేశ్‌ కార్తీక్‌
షారుఖ్‌ఖాన్‌ చేసిన పనిని బయటపెట్టిన దినేశ్‌ కార్తీక్‌
షారుఖ్‌ఖాన్‌ చేసిన పనిని బయటపెట్టిన దినేశ్‌ కార్తీక్‌

ట్రెండింగ్‌

Advertisement