కరకగూడెం, మే 27 : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక- మహిళా వారోత్సవాల సందర్భంగా బుధవారం కరకగూడెం మండలం కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షురాలు పోలెబోయిన సరస్వతి అధ్యక్షతన స్వయంశక్తి మండల మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏపీఏం బండి వినోద్ క్రాంతి ఉత్తమ గ్రామ సమాఖ్యలకు సన్మానం నిర్వహించి అనంతరం మాట్లాడారు. గ్రామ సమాఖ్యలు ప్రత్యేక ఏజెండాతో పాటు సంఘాలలో నాయకత్వ మార్పిడి, పుస్తకాల, నిధుల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కొత్త అప్పుల మంజూరుకు సమగ్ర సమాచారంతో ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం 2026- 27 కార్యచరణ ప్రణాళికతో పాటు గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీసీ విజయలక్ష్మీ, అకౌంటెంట్ ప్రీతి, వీఓఏలు పాల్గొన్నారు.