e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News ఆఫ్ఘాన్‌లోకి జిహదీలను పంపారు : పాక్‌పై ఘనీ ఘాటు వ్యాఖ్య

ఆఫ్ఘాన్‌లోకి జిహదీలను పంపారు : పాక్‌పై ఘనీ ఘాటు వ్యాఖ్య

ఆఫ్ఘాన్‌లోకి జిహదీలను పంపారు : పాక్‌పై ఘనీ ఘాటు వ్యాఖ్య

తాష్కెంట్‌ : పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం తమ దేశంలోకి పది వేల మంది జిహదీలను పంపించిందని ఘనీ ఆరోపించారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ఆ దేశ మిలటరీ జనరల్‌ ఇద్దరూ తాలిబాన్‌ పక్షాన ఉన్నారని మండిపడ్డారు. తాష్కెంట్‌లో సెంట్రల్‌, సౌత్‌ ఏసియా కాంటాక్ట్‌ కాన్ఫరెన్స్‌లో అష్రాఫ్‌ ఘనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఘనీ ఈ ఆరోపణలు చేస్తున్న సమయంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆయనకు ఎదురుగానే కూర్చున్నారు. ఈ చర్చ అనంతరం శాంతి సమావేశం వాయిదా పడింది.

‘గత నెలలో తమ దేశంలోని పాకిస్తాన్‌ 10 వేల మంది జిహదీలను పంపింది. దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్‌ నివేదికలు తమ వద్ద ఉన్నాయి. పాకిస్తాన్‌ ఇప్పటికే ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలను తెంచుకోలేదు’ అని అష్రాఫ్‌ ఘనీ ఆరోపించారు. శాంతి చర్చలకు తాలిబాన్లు వచ్చేలా చేయడంలో పాకిస్తాన్‌ చొరవచూపడం లేదని కూడా చెప్పారు. ఇమ్రాన్‌ఖాన్‌, పాక్‌ మిలటరీ జనరల్‌ తాలిబాన్లను వెనకేసుకు రావడం వల్ల తమ దేశంలో తాలిబాన్లు రెచ్చిపోతున్నారని, ప్రభుత్వం, ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉత్సవాలు చేసుకుంటున్నారని ఘనీ అన్నారు.

అబ్బే! అదేం లేదు.. మీ వల్లే మా వాళ్లు చనిపోయారు: ఇమ్రాన్‌ఖాన్‌

- Advertisement -

ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ చేసిన వ్యాఖ్యలపై ఇమ్రాన్‌ఖాన్‌ చాలా కూల్‌గా స్పందించారు. అబ్బే అదేం లేదు.. ఆఫ్ఘనిస్తాన్‌ కారణంగానే మా వాళ్లు ఎందరో చనిపోయారన్నారు. ‘ఈ వివాదంలో పాకిస్తాన్ ప్రతికూల పాత్ర ఉందని వింటున్నప్పుడు నిరాశ చెందాను. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న గందరగోళం కారణంగా పాకిస్తాన్‌లో గత 15 ఏండ్లలో 70 వేల మంది మరణించారు. ఈ విషయాలను కూడా వారు ముందుంచితే బాగుంటుంది. శాంతి చర్చలకు మేం ఎప్పుడూ సిద్ధమే’ అని ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు.

ఇలాఉండగా, ఆఫ్ఘనిస్తాన్‌లో మూడు జిల్లాల్లో పాగా వేసిన తాలిబాన్లను అక్కడి నుంచి సైన్యం తరిమివేసిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.సైఘన్, కహ్మార్డ్, చఖన్‌సూర్ జిల్లాలను ఆఫ్ఘన్ భద్రతా దళాలు తాలిబాన్ ఆక్రమణ నుండి విడిపించాయని వెల్లడించింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

త్వరలో స్పేస్‌ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..

కరోనా ట్రైలరే.. ముందుంది ముసళ్ల పండుగ : రిచర్డ్‌ సెనెట్‌

చరిత్రలో ఈరోజు.. భారత స్వాతంత్య్ర చట్టానికి బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం

సువేందు మెడకు బాడీగార్డ్‌ మృతి కేసు

ఆ ఫొటో జర్నలిస్ట్‌ను మేం చంపలేదు : తాలిబాన్

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆఫ్ఘాన్‌లోకి జిహదీలను పంపారు : పాక్‌పై ఘనీ ఘాటు వ్యాఖ్య
ఆఫ్ఘాన్‌లోకి జిహదీలను పంపారు : పాక్‌పై ఘనీ ఘాటు వ్యాఖ్య
ఆఫ్ఘాన్‌లోకి జిహదీలను పంపారు : పాక్‌పై ఘనీ ఘాటు వ్యాఖ్య

ట్రెండింగ్‌

Advertisement