తుంగతుర్తి, జూన్ 01 : మాజీ సర్పంచుల పాత పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తుంగతుర్తి మండలం సూర్యతండా మాజీ సర్పంచ్ యాకూనాయక్ డిమాండ్ చేశారు. సోమవారం మాజీ సర్పంచుల ఫారం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమానికి బయల్దేరిన ఆయనను స్థానిక పోలీసులు మందస్తు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తీసుకొచ్చి లక్షల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేయకుండా తమ జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.