Gulveer Singh | అప్పుడు కాంస్యం.. ఇప్పుడు రజతం.. మారథాన్‌లో మళ్లీ మెరిసిన గుల్వీర్..!
Gulveer Singh : జపాన్‌లోని నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు మెరుస్తున్నారు. పురుషుల100 మీటర్ల పరుగులో గురిందెర్వీర్ సింగ్, అనిమేశ్ కుజుర్లు నిరాశపరిచినా.. 'నేనున్నాంటూ' మారథాన్ పరుగులో గుల్వీర్ సింగ్ (Gulveer Singh) పతకంతో మెరిశాడు.
Gulveer Singh : జపాన్‌లోని నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో(Asian Games) భారత అథ్లెట్లు మెరుస్తున్నారు. పురుషుల100 మీటర్ల పరుగులో గురిందెర్వీర్ సింగ్, అనిమేశ్ కుజుర్లు నిరాశపరిచినా.. ‘నేనున్నాంటూ’ మారథాన్ పరుగులో గుల్వీర్ సింగ్ (Gulveer Singh) పతకంతో మెరిశాడు. 10 వేల మీటర్లలో సత్తా చాటిన గుల్వీర్ రెండో స్థానంలో నిలిచి దేశానికి సిల్వర్ మెడల్ అందించాడు. దాంతో.. ఆసియాడ్‌లో వరసగా రెండో పతకం ఖాతాలో వేసుకున్నాడీ రన్నర్. 2023లో హంగ్జూలో గుల్వీర్ కాంస్యం సాధించాడు.
పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ వెండి వెలుగులు విరజిమ్మాడు. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో అసమాన పట్టుదలను ప్రదర్శించిన అతడు సిల్వర్ మెడల్ సాధించాడు. ఆసియాడ్ వంటి పెద్ద వేదికలపై నేను ఎప్పుడూ నిరాశపరచను అని చాటుతూ పోడియం మీద సగర్వంగా నిలబడ్డాడీ రన్నర్. శుక్రవారం జరిగిన పురుషుల 10 వేల మీటర్ల పరుగులో గుల్వీర్ 28:29.38 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్నాడు. అతడి కంటే 1.87 సెకన్ల ముందుగా పరుగు పూర్తి చేసిన బిర్హను బలెవ్(బహ్రెయిన్) స్వర్ణం ఎగరేసుకుపోయాడు.
🥈🇮🇳 GULVEER SINGH WINS SILVER!
Gulveer bags silver in the Men’s 10,000m at the Asian Games 2026! 🔥pic.twitter.com/10BthUGpWp
— Sports Apna 🇮🇳 (@sportsapna1) September 25, 2026
మిశ్రమ ఫలితాలు
అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఆరోరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల 100 మీటర్లలో గురిందెర్విర్ సింగ్, అనిమేశ్ కుజుర్లు నిరాశపరిచారు. 10.38 సెకన్లతో అనిమేశ్ సెమీస్ ముందే వెనుదిరిగాడు. 10.32 సెకన్లతో సెమీస్ చేరిన గురిందెర్విర్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ఈ ఇద్దరూ విఫలమైన చోట.. గుల్వీర్ సింగ్ వెండితో భారతావని పులకించేలా చేశాడు. మొత్తంగా ఈ విభాగంలో భారత్‌కు అతడు రెండో పతకం అందించాడు. గురువారం మహిళల 10 వేల మీటర్ల పరుగులో సీమా కుమారి కాంస్యంతో చరిత్ర సృష్టించింది. 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పతకంతో మురిసింది సీమ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

