రాయపోల్ : సిద్దిపేట జిల్లా రాయపోల్ ( Rayapol ) మండలంలో శుక్రవారం గణేశ్ నిమజ్జనాలు( Ganesh Immersion ) ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలోని యువ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ఘనంగా వీడ్కోలు పలికారు. లడ్డు వేలం పాటను ఉత్సహాంగా నిర్వహించారు. వేలం పాటలో లడ్డూలను దక్కించుకున్న విజేతలను పలువురు అభినందించారు.
అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. డప్పులు, మేళతాళాలు, నృత్యాలతో యువత ఉత్సాహంగా పాల్గొనగా పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. భక్తులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు ఇచ్చారు.. యువకులు ఆనందోత్సవంలో వినాయక నిమజ్జనం నిర్వహించారు.