చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్‌గా పగిళ్ల సందీప్
చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్‌గా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పగిళ్ల సందీప్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న అధికారికంగా నిర్వహించనున్న వీరనారి చాకలి ఐలమ్మ...
నకిరేకల్, సెప్టెంబర్ 25 : చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్‌గా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పగిళ్ల సందీప్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న అధికారికంగా నిర్వహించనున్న వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాల రాష్ట్ర కమిటీలో కన్వీనర్‌గా ఆయనకు అవకాశం లభించింది. ఈ సందర్భంగా పగిళ్ల సందీప్ మాట్లాడుతూ, “భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి ప్రజా ఉద్యమాలకు చిరస్థాయి స్ఫూర్తి” అన్నారు. దోపిడీ, బానిస సంస్కృతికి ధైర్యంగా ఎదురు నిలిచి ఐలమ్మ చూపిన పోరాట స్ఫూర్తి తెలంగాణ సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. భూస్వామ్య దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన భూ పోరాటం కారణంగా ప్రజల్లో హక్కులపై చైతన్యం పెరిగిందని తెలిపారు. “ప్రతి పేదవాడి పిడికిలిలో చాకలి ఐలమ్మ స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది” అని ఆయన అన్నారు. ఈ ఎన్నిక కు సహకరించిన తెలంగాణ రజక ఫెడరేషన్ చైర్మన్ దాసరాజు అజయ్ కుమార్, కొన్నే సంపత్, కులుకులపల్లి రాధికలకు పగిళ్ల సందీప్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

