e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News ఆ ఫొటో జర్నలిస్ట్‌ను మేం చంపలేదు : తాలిబాన్

ఆ ఫొటో జర్నలిస్ట్‌ను మేం చంపలేదు : తాలిబాన్

ఆ ఫొటో జర్నలిస్ట్‌ను మేం చంపలేదు : తాలిబాన్

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ కందహార్‌లో శుక్రవారం భారత ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మృతిపై తాలిబాన్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. డానిష్‌ సిద్దిఖీ మరణంతో మేమెంతో బాధపడుతున్నామని తాలిబాన్ ప్రతినిధి జబీల్లా ముజాహిద్ మీడియాకు చెప్పారు. ‘మాకు సమాచారం ఇవ్వకుండానే పలువురు జర్నలిస్టులు యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతానికి వస్తున్నారని తెలిసి చాలా బాధపడ్డాం. ఆ జర్నలిస్ట్ ఎవరి కాల్పుల్లో చనిపోయాడో తమకు తెలియదు. యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతాన్ని సందర్శించే ఏ జర్నలిస్టు అయినా ముందుగా తమకు సమాచారం ఇచ్చినప్పుడే వారిని రక్షించేలా చూసుకుంటాం’ అని పేర్కొన్నారు.

రాయిటర్స్ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘన్ భద్రతా దళాలు-తాలిబాన్ మధ్య ఘర్షణను కవర్ చేస్తండగా బుల్లెట్‌ తగిలి చనిపోయాడు. పులిట్జర్ బహుమతి పొందిన జర్నలిస్ట్ వయసు 38 సంవత్సరాలు. స్పిన్ బోల్డాక్ ప్రధాన మార్కెట్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తాపత్రయంలో ఆఫ్ఘన్ దళాలు పోరాడుతుండగా.. సిద్దిఖీ, మరో సీనియర్ ఆఫ్ఘన్ అధికారి బుల్లెట్‌ తగిలి చనిపోయారని ఆఫ్ఘన్ కమాండర్ ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు.

- Advertisement -

డానిష్ సిద్దిఖీ మృతదేహాన్ని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ఐసీఆర్‌సీ) కి తాలిబాన్‌ అందజేసింది. మృతదేహాన్ని ఐసీఆర్‌సీకి అప్పగించడంపై భారత్‌కు సమాచారం అందింది. డానిష్‌ మృతదేహాన్ని భారత్‌ తీసుకురావడానికి భారతదేశం అధికారులు కృషి చేస్తున్నారు. ‘ఈ సంఘటన గురించి మేం మరింత సమాచారం సేకరిస్తున్నాం. సిద్దిఖీ అత్యుత్తమ పాత్రికేయుడు, అంకితభావం గల ఉద్యోగి. అతను అందరికీ ఇష్టమైన వ్యక్తి. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం అని రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రైడెన్‌బర్గ్, ఎడిటర్ ఇన్ చీఫ్ అలెశాండ్రా గల్లోని ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

విద్యార్థులు ‘కట్నం తీసుకోం’ అనే బాండ్‌ ఇవ్వాలి : కేరళ గవర్నర్‌

యూజీసీ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

మనం నిత్యం వాడే ‘ఎమోజీ’ గురించి తెలుసా..?

సోనియా గాంధీకి కెప్టెన్‌ ఘాటు లేఖ

ఆ గ్రామ ప్రజల్ని తరలించకండి: భారత్‌కు యూఎన్‌ లేఖ

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ ఫొటో జర్నలిస్ట్‌ను మేం చంపలేదు : తాలిబాన్
ఆ ఫొటో జర్నలిస్ట్‌ను మేం చంపలేదు : తాలిబాన్
ఆ ఫొటో జర్నలిస్ట్‌ను మేం చంపలేదు : తాలిబాన్

ట్రెండింగ్‌

Advertisement