e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News మనం నిత్యం వాడే ‘ఎమోజీ’ గురించి తెలుసా..?

మనం నిత్యం వాడే ‘ఎమోజీ’ గురించి తెలుసా..?

మనం నిత్యం వాడే ‘ఎమోజీ’ గురించి తెలుసా..?

ఎమోజీ.. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయాయి. మొబైల్‌ ఫోన్‌ తెరవగానే కనిపిస్తూ మన పెదాలపై చిరునవ్వును తెప్పిస్తుంటాయి. పదాలను ఉపయోగించకుండా భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి సులభమైన మార్గం. వచన సందేశాలను పంపడం మన దైనందిన జీవితంగా భాగంగా మారింది. ఒకరికి చాట్ చేసేటప్పుడు లేదా వచన సందేశాలను పంపేటప్పుడు ఎమోజీలు లేకపోవడాన్ని ఊహించుకోలేని పరిస్థితికి వచ్చేశాం. ఎమోజీలు లేకుండా ఎవరితోనైనా మాట్లాడటం విసుగు తెప్పిస్తుందనే చెప్పాలి. వర్చువల్ టెక్స్ట్ సంభాషణ ఎమోజీలు లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది. అంతగా పెనవేసుకుపోయిన ఎమోజీలు ప్రస్తుతం ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

ప్రతి సంవత్సరం జూలై 17 న ప్రపంచ ఎమోజి దినోత్సవాన్ని జరుపుకుంటారు. లండన్‌కు చెందిన ఎమోజిపీడియా వ్యవస్థాపకుడు జెరెమీ బర్జ్ 2014 లో ఎమోజీని సృష్టించారని చెప్తారు. ఎమోజీ అనేది జపనీస్ పదం. జపాన్‌ భాషలో ఎమోజీ అంటే చిత్ర పదం. వాట్సాప్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ వరకు, ట్విట్టర్ నుంచి ఫేస్‌బుక్ వరకు ప్రతిచోటా ఎమోజీలు మనకు దర్శనమిస్తుంటాయి. ఫోన్లలోనే కాకుండా మనం నిత్య వాడుకునే దిండ్లు, దుప్పట్లు, కాఫీ కప్పులు, టీ-షర్టులు వంటి ఎమోజీ గూడీస్‌తో మార్కెట్ ఎంబోజీలతో నిండి ఉన్నది. సంవత్సరాలుగా అనేక కొత్త ఎమోజీలు పుట్టుకొస్తున్నాయి. అయితే, ఒక్కోసారి పసుపు రంగులో ఉండే ఈ చిన్న ఇల్లస్ట్రేటివ్ కార్టూన్లు కూడా తప్పుగా అర్ధం చేసుకోబడుతున్నాయి.

ఇదీ ఎమోజీ చరిత్ర..

మనం నిత్యం వాడే ‘ఎమోజీ’ గురించి తెలుసా..?
- Advertisement -

జపాన్ టెలికాం సంస్థ ఎన్‌టీటీ.. డోకోమోతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎమోజీలను మొదట షిగేటకా కురిటా 1999 లో అభివృద్ధి చేశారు. స్మార్ట్‌ఫోన్లు రోజువారీ జీవితంలో భాగంగా మారినప్పుడు 2010 లో ఎమోజీలు ప్రాచుర్యం పొందాయి. 176 చిహ్నాలతో ప్రారంభమైన ఈ భాష.. నేడు 3,353 ఎమోజీలకు చేరుకున్నది. ప్రపంచ ఎమోజీ దినోత్సవాన్ని జెరెమీ బర్జ్ రూపొందించారు. అతన్ని ఎమోజిపీడియా వ్యవస్థాపకుడు అని కూడా అంటారు. ప్రపంచ ఎమోజి దినోత్సవాన్ని 2014 నుండి ఏటా జరుపుకుంటున్నారు.

2007 లో ఐఫోన్ విడుదలైనప్పుడు జపనీస్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడానికి ఎమోజి కీబోర్డ్‌ను ఏర్పాటుచేశారంటే.. ఎమోజీలకు ఎంత ప్రాచుర్యం ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత సంవత్సరం కన్నీటితో నవ్వుతున్న ముఖం, లింగమార్పిడి జెండా, బబుల్ టీ, బాటిల్‌తో తినిపించే తల్లిదండ్రులు వంటి 110 కి పైగా కొత్త ఎమోజీలను ఎమోజీ 13.0 లోని యూనికోడ్ కన్సార్టియం చేర్చింది. టెక్ దిగ్గజం ఆపిల్‌ సంస్థ తమ ఐఓఎస్‌ 14 తాజా విడుదల ఫోన్ల కీబోర్డ్‌కు ఎమోజీ సెర్చ్‌ను జోడించడం విశేషం.

ఇవి కూడా చ‌ద‌వండి..

సోనియా గాంధీకి కెప్టెన్‌ ఘాటు లేఖ

ఆ గ్రామ ప్రజల్ని తరలించకండి: భారత్‌కు యూఎన్‌ లేఖ

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మనం నిత్యం వాడే ‘ఎమోజీ’ గురించి తెలుసా..?
మనం నిత్యం వాడే ‘ఎమోజీ’ గురించి తెలుసా..?
మనం నిత్యం వాడే ‘ఎమోజీ’ గురించి తెలుసా..?

ట్రెండింగ్‌

Advertisement