సూర్యాపేట : శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు ( Bakrid Greetings ) తెలిపారు. త్యాగం, ప్రేమ, భక్తికి ప్రతీక బక్రీద్ అని,అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు.భక్తి శ్రద్దలతో జరిపే అందరి ప్రార్థనలు ఫలించాలని తెలిపారు.తెలంగాణాలో కుల, మతాల ఐక్యతను పెంచిన ఘనత కేసీఆర్( KCR ) దేనని,ఆయన హయాంలోనే పండుగలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయని పేర్కొన్నారు.
అన్ని మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని వివరించారు.గాంధీ లాంటి మహనీయుల కలలు సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.గంగా,జమున తహజీబ్లా తెలంగాణాలో అన్ని మతాలు కలిసిమెలసి జీవిస్తున్నామని అన్నారు.గత పదమూడేండ్లుగా పండుగలన్నీ ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నామని,ఇదే సంస్కృతిని ముందు తరాలకు అందేలా కొనసాగించుకుం దామని పిలుపునిచ్చారు.