సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్..! ఎందుకంటే..?
తాను క్రిస్టియన్ అయినా.. సిద్ధివినాయకుడి దయతో ఉన్నత స్థాయికి ఎదిగానంటూ చెప్పడమే కాదు, కోట్లు వెచ్చించి అందమైన గుడి కట్టించాడు. ఆ పక్కనే పూజారి నివాసం కూడా నిర్మించి ఇచ్చాడు

ఉడుపి : మన పని ఏదైనా అనుకున్నట్లుగా పూర్తయితే అంతా దేవుడి వల్లే..! అని చెప్పుకుంటుంటాం. అందుకు ప్రతిగా కొబ్బరికాయ కొట్టడమో, తలనీలాలు అర్పించడమో, పది మందికి భోజనం పెట్టించడమో.. మరీ కాదనుకుంటే తమ ఇష్టదైవం ఎక్కడున్నా దర్శించుకునేందుకు పోవడం వంటివి చేస్తుంటాం. అయితే, ఈ పెద్దాయాన మాత్రం తాను క్రిస్టియన్ అయినా.. సిద్ధివినాయకుడి దయతో ఉన్నత స్థాయికి ఎదిగానంటూ చెప్పడమే కాదు, కోట్లు వెచ్చించి అందమైన గుడి కట్టించాడు. ఆ పక్కనే పూజారి నివాసం కూడా నిర్మించి ఇచ్చాడు. కరోనా మహమ్మారి కారణంగా ఆలయం ప్రారంభోత్సవం ఆలస్యం అయినప్పటికీ.. గత బుధవారం నుంచి శాస్త్రోక్తంగా ప్రారంభ కార్యక్రమాలను జరిపిస్తున్నాడు.
ఉడుపికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిర్వ గ్రామానికి చెందిన గాబ్రియల్ నజెరెత్ జన్మతః క్రిస్టియన్. పదో తరగతి పాస్ కాగానే ఉద్యోగం వెతుక్కుంటూ ముంబై దారి పట్టాడు. అక్కడ చిన్నాచితకా పనులు చేసి పొట్టపోసుకున్నాడు. చివరకు బ్లాక్‌లు, మోల్డ్‌లు తయారుచేసే ఫ్యాక్టరీని స్థాపించి గత 55 ఏండ్లుగా వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. ముంబైలో ఉన్న రోజుల్లో సిద్ధివినాయకుడికి నిత్యం పూజలు చేయడం వల్లనే వ్యాపారంలో రాణించానని గట్టిగా నమ్మిన గాబ్రియల్.. పదేండ్ల క్రితం కర్ణాటకలోని తమ సొంతింటికి రాగానే సిద్ధివినాయకుడి గుడి కట్టాలని తీర్మానించుకున్నాడు.
ఉడుపికి సమీపంలో ఉన్న శిర్వ గ్రామంలో తన పూర్వీకులకు చెందిన స్థలంలో గుడి కట్టడం మొదలుపెట్టి ఇటీవలనే పూర్తిచేశాడు. 20 సెంట్ల స్థలంలో దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో ఈ గుడిని నిర్మించాడు. గుడిలో 36 అంగుళాల పరిమాణంలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడు. పక్కనే పూజారి కోసం ఓ ఇంటిని కూడా నిర్మించి ఇచ్చాడు. తాను నమ్ముకున్న దైవం కోసం తన మతాన్ని అవహేళన చేయడం లేదని, సిద్ధివినాయకుడిపై తనకున్న నమ్మకానికి ప్రతిరూపంగానే ఈ ఆలయాన్ని నిర్మించానని చెప్తున్నాడు గాబ్రియల్ నజెరెత్. కరోనా మహమ్మారి కారణంగా ఆలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. కాగా, గత బుధవారం నుంచి పూజాధికాలు జరిపి ఆలయాన్ని భక్తుల కోసం తెరిచారు.
ఇవి కూడా చదవండి..
ఆఫ్ఘాన్‌లోకి జిహదీలను పంపారు : పాక్‌పై ఘనీ ఘాటు వ్యాఖ్య
త్వరలో స్పేస్ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..
కరోనా ట్రైలరే.. ముందుంది ముసళ్ల పండుగ : రిచర్డ్ సెనెట్
చరిత్రలో ఈరోజు.. భారత స్వాతంత్య్ర చట్టానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం
సువేందు మెడకు బాడీగార్డ్ మృతి కేసు
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

