హైదరాబాద్ : శాంతి చర్చలతో త్వరలోనే పశ్చిమాసియాలో(West asia) యుద్ధానికి ముగింపు పలుకుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతున్నది. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగానే ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతాలపై అమెరికా తీవ్ర దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. దక్షిణ ఇరాన్లో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్స్ అమర్చుతున్న పడవలపై తాము ఆత్మరక్షణ దాడులు నిర్వహించినట్టు అమెరికా సైన్యం తెలిపింది.
తాజాగా ఇజ్రాయెల్-లెబనాన్(Southern Lebanon) మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్(Israel) జరిపిన వైమానిక దాడుల్లో పలువురు చిన్నారులతో సహా కనీసం 31 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అర్ధరాత్రి గాజాపై ఇజ్రాయెల్ రెండు చోట్ల వైమానిక దాడులక పాల్పడింది.ఈ దాడుల్లో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించగా 12 మంది గాపడ్డారు.
ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జరిగిన అతి పెద్ద దాడి ఇదేనని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. హెజ్బొల్లా మిలిటెంట్లు తమ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు ప్రయోగించారని , దానికి ప్రతిస్పందనగానే ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
హిజ్బుల్లా ప్రతీకారం
ఇజ్రాయెల్ దళాలను తమ యోధులు సమర్దవంతంగా ఎదుర్కొన్నారని హిజ్బుల్లా తెలిపింది. వైమానిక దాడులు, ఫిరంగి కాల్పుల తర్వాత జౌతర్ అల్-షర్కియా వైపు దూసుకొస్తున్న ఇజ్రాయెల్ దళాన్ని హిజ్బుల్లా యోధులు వెనక్కి తరిమికొట్టారని ఆ సాయుధ బృందం పేర్కొంది. ఆ పట్టణంలో ఇజ్రాయెల్ దళాలపై జరిగిన వరుస డ్రోన్, రాకెట్ దాడులకు తామే బాధ్యులమని స్పష్టం చేసింది.