Renu Desai | రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్‌కు బిగ్ టర్న్.. ధనుష్ ‘ఓం’లో మమ్ముట్టికి జోడీగా కీలక పాత్ర!
Renu Desai | ఒకప్పుడు నటిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రేణు దేశాయ్ చాలా కాలం పాటు వెండితెరకు దూరంగా ఉన్నారు. దర్శకత్వం, రచన, సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించిన ఆమె.. ఇటీవల 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమె పునరాగమనం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
Renu Desai | ఒకప్పుడు నటిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రేణు దేశాయ్ చాలా కాలం పాటు వెండితెరకు దూరంగా ఉన్నారు. దర్శకత్వం, రచన, సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించిన ఆమె.. ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమె పునరాగమనం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయినా నటనపై ఉన్న ఆసక్తిని మాత్రం రేణు దేశాయ్ తగ్గించుకోలేదు. రొటీన్ కమర్షియల్ పాత్రల కంటే నటిగా తన ప్రతిభను చాటుకునే బలమైన పాత్రలను మాత్రమే ఎంచుకోవాలనే ఆలోచనతో ఆమె ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రేణు దేశాయ్ తదుపరి ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఓంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో లెజెండరీ నటుడు మమ్ముట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అందులో మమ్ముట్టికి జోడీగా రేణు దేశాయ్ కనిపించనున్నారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పేరుకు మాత్రమే పరిమితం కాకుండా, కథను కీలక మలుపు తిప్పే భావోద్వేగభరితమైన పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో కంటెంట్ ఆధారిత చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి సమయంలో గ్లామర్ పాత్రల కంటే నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకోవడం ద్వారా రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను భిన్నంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మమ్ముట్టి వంటి దిగ్గజ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమె కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలవొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పాత్ర ద్వారా ఆమె నటిగా మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అక్క, వదిన, తల్లి లేదా కుటుంబ నేపథ్యం ఉన్న బలమైన పాత్రలకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి పాత్రలను సమర్థంగా పోషించే నటీమణులు తక్కువగా ఉన్న నేపథ్యంలో, రేణు దేశాయ్ వంటి మెచ్యూర్డ్ ఇమేజ్ ఉన్న నటి తిరిగి సినిమాల్లో చురుకుగా నటించడం టాలీవుడ్‌కు కూడా సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగితే రేణు దేశాయ్‌కు తెలుగు, తమిళ భాషల్లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అయితే, ధనుష్ ‘ఓం’ చిత్రంలో రేణు దేశాయ్ పాత్రకు సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

